వెంకయ్య మార్నింగ్ వాక్: టీ షర్ట్, పలకరింపు (పిక్చర్స్)
విశాఖపట్నం: బిజెపి సీనియర్ నేత, ప్రస్తుత కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు పంచ్ డైలాగులకే కాకుండా తెల్లటి పంచెకట్టుకు, తెల్లటి చొక్కాకు మారుపేరు. ఆయన ఢిల్లీలో అయినా, ఆంధ్రలో అయినా తనదైన శైలిలో అడ్డ పంచె, తెల్లటి చొక్కాతో దర్శనమిస్తారు. బహిరంగ సభల్లోనైనా, మీడియా సమావేశాల్లో అయినా వార్తలకు శీర్షికల కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా డైలాగులు చెప్పేస్తారు.
వెంకయ్యనాయుడి శైలి చాలా భిన్నమైందీ, ప్రత్యేకమైంది కూడా. కేంద్ర మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆయన శైలి మారలేదు. విమర్శలకు పదునైన మాటలను దట్టించడం ఆయన ప్రత్యేకత. కాగా, ఆయన ఇటీవల టీ షర్టు ధరించి కనిపించారు. సహజమైన శైలికి భిన్నంగా టీ షర్టు, ప్యాంట్ ధరించి మార్నింగ్ వాక్ చేస్తూ కనిపించారు.
ఇటీవల ఆయన విశాఖపట్నం వచ్చారు. ఆ సందర్భంగా విశాఖపట్నంతో తనకు గల అనుబంధాన్ని వివరించారు. ఆయనకు విశాఖలో సన్మానం జరిగింది. విశాఖపట్నం తన పుట్టిల్లులా అనిపిస్తుందని ఆయన అన్నారు.

వెంకయ్య మార్నింగ్ వాక్
బిజెపి సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఆదివారంనాడు విశాఖపట్నంలో మార్నింగ్ వాక్ చేస్తూ ఇలా కనిపించారు. ఆయన వెంట విశాఖపట్నం ఎంపి హరిబాబు కూడా ఉన్నారు.

కరచాలనాలు, పలకరింపులు..
వెంకయ్యనాయుడు అందిరకీ దగ్గరగా ఉండాలని చూస్తారు. తనకు ఎదురుపడినవారితో కరచాలనం చేస్తూ, వారిని పలకరిస్తూ మార్నింగ్ వాక్‌లో ఆయన ఇలా కనిపించారు.

వెంకయ్య తీరే వేరు..
విశాఖపట్నంలో మార్నింగ్ వాక్ చేస్తూ బిజెపి సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు అందరితో కలివిడిగా వ్యవహరించారు.

మీడియా సమావేశంలో...
బిజెపి సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు రాజకీయాల్లో ఇలా కనిపిస్తారు. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వెంకయ్య నాయుడు, పక్కన ఎంపి హరిబాబు












Click it and Unblock the Notifications