తుఫాను విధ్వంసం: తేరుకోని విశాఖ (పిక్చర్స్)

విశాఖపట్నం: తుఫాను తాకిడికి కకావికలమైన విశాఖనగరం తేరుకోవడానికి ఇంకా సమయం పట్టేట్లు ఉంది. అన్ని సౌకర్యాలతో విరాజిల్లే విశాఖ నగరంలో నేడు గుక్కెడు మంచినీరు దొరకని పరిస్థితి నెలకొంది. కనీసం వాటర్ ప్యాకెట్ దొరికినా ప్రజలకు మహద్భాగ్యమే. చంటి పిల్లలకు పాలు దొరకక అల్లాడిపోతున్నారు.

తాగడానికి కాదు, కనీసం కాలకృత్యాల తీర్చుకోడానికీ నీరులేని దయనీయ స్థితి విశాఖలో నెలకొంది. ఆహారం కోసం జనం వెంపర్లాడుతున్నారంటే విశాఖ దుస్థితిని వేరే చెప్పనక్కర్లేదు. ఎంతో వైభవంగా వెలిగిపోయే విశాఖను హుధుద్ తుపాను ఒక్కరోజులో ఈ స్థితికి తెచ్చింది. దెబ్బతిన్న దుకాణాల నుంచి వస్తువుల లూటీలు ఆరంభమయ్యాయి. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులుంటే కరవు దాడులకు చాన్స్ లేకపోలేదన్న భావన వ్యక్తమవుతోంది.

నగరంలో గడచిన శనివారం రాత్రి నుంచి విద్యుత్ లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖలోనే మకాం వేసి ప్రతి శాఖ పనితీరును సమీక్షిస్తున్నారు. మంగళవారం సాయంత్రానికి నగరంలో చాలావరకూ విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. కానీ 10శాతం ప్రాంతానికీ కూడా విద్యుత్ రాలేదు. ఈపిడిసిఎల్, ఎస్పీడిసిఎల్‌తో పాటు, తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన విద్యుత్ సిబ్బంది రంగంలోకి దిగినా ఒక్క లైటూ వెలిగే పరిస్థితి లేదు.

తేరుకోని విశాఖ

తేరుకోని విశాఖ

తుఫాను బీభత్సంతో విలవిలలాడుతున్న విశాఖలో భయంకరమైన ఎండలు ఉండటంతో జనం ఉక్కపోతతో అల్లాడుతున్నారు. వారం రోజుల వరకూ పూర్తిస్థాయిలో విద్యుత్ వచ్చే పరిస్థితి లేదని అధికారులు తేల్చి చెబుతున్నారు.

తేరుకోని విశాఖ

తేరుకోని విశాఖ

మంచినీరు దొరకకపోవడంతో నిన్నటి వరకూ వాటర్ క్యాన్స్ కొనుగోలు చేసుకున్న వారు మంగళవారం వాటర్ ప్యాకెట్లకూ పాకులాడారు. విశాఖ డెయిరీ పాలకోసం జనం వ్యాన్ల వద్ద కొట్టుకునే పరిస్థితి వచ్చింది.

తేరుకోని విశాఖ

తేరుకోని విశాఖ

ఇళ్ళలో నీరు లేకపోవడంతో కాలకృత్యాలను చెరువుల వద్ద, బావుల వద్ద తీర్చుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మహిళలు రోడ్లమీద బోరు బావుల వద్దకు రాత్రి పూట వెళ్లి స్నానాలు చేసే పరిస్థితి ఉంది.

తేరుకోని విశాఖ

తేరుకోని విశాఖ

తాగునీటి కోసం చాలాదూరం నడిచి వెళ్లాల్సి వస్తోంది. ఇక పాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 22 రూపాయల పాల ప్యాకెట్‌ను 30 రూపాయలకు విక్రయించారు.

తేరుకోని విశాఖ

తేరుకోని విశాఖ

పాలు, పెట్రోలు, డీజిల్, కూరలు, తాగునీరు ఇలా ఒకటేమిటి, అన్ని నిత్యావసర వస్తువులనూ అధిక ధరకు విక్రయిస్తున్నారు. ముఖ్యమంత్రి హెచ్చరించినా ఫలితం కనిపించడం లేదు.

తేరుకోని విశాఖ

తేరుకోని విశాఖ

తుపాను తీరం దాటి రోజులు గడిచాయి. విలయంతో విలవిలాడిన జనాన్ని ఆదుకునేందుకు సాక్షాత్తూ ముఖ్యమంత్రే విశాఖకు చేరుకున్నారు.

తేరుకోని విశాఖ

తేరుకోని విశాఖ

సహాయక చర్యలు చేపట్టడానికి ఎన్‌డిఆర్‌ఎఫ్, త్రివిధ దళాలను ప్రభుత్వం రంగంలోకి దించింది. వీటిలో ఎన్‌డిఆర్‌ఎఫ్, ఒడిశా నుంచి వచ్చిన ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సిబ్బంది మాత్రమే సహాయక చర్యల్లో పనిచేస్తున్నారు.

తేరుకోని విశాఖ

తేరుకోని విశాఖ

నేవీ, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది మచ్చుకైనా సహాయక చర్యల్లో కనిపించడం లేదు. ముఖ్యమంత్రి బస చేసిన కలెక్టరేట్‌లోనే భారీ వృక్షాలు నేలకొరిగినా, మంగళవారం సాయంత్రానికి కూడా తొలగించలేకపోయారు.

తేరుకోని విశాఖ

తేరుకోని విశాఖ

ప్రతి పెట్రోలు బంక్ వద్ద వేల సంఖ్యలో జనం రావడం వల్ల కొట్లాటకు దారి తీసే పరిస్థితులు నెలకొన్నా, పోలీసులు ఆవైపు వెళ్లకపోడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

తేరుకోని విశాఖ

తేరుకోని విశాఖ

విశాఖపట్నం తుఫాను తాకిడికి విలవిలలాడింది. ఇలా కూరగాయాలు, నిత్యవాసరుకులు రోడ్ల మీదే ఉన్నాయి.

తేరుకోని విశాఖ

తేరుకోని విశాఖ

విశాఖపట్నంలో విద్యుత్తు స్తంభాలు, టెలిఫోన్ స్తంభాలు, మిగతా స్తంభఆలు అన్నీ కుప్పకూలాయి. సాధారణ స్థితికి ఇంకా సమయం పట్టే పరిస్థితి ఉంది.

తేరుకోని విశాఖ

తేరుకోని విశాఖ

భారీ వృక్షాలు కూడా కూలి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. వాటిని తొలగించడానికి సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

తేరుకోని విశాఖ

తేరుకోని విశాఖ

ఆహార పొట్లాల కోసం విశాఖపట్నం నగరంలో ప్రజలు ఇలా గుమిగూడారు. సహాయక శిబిరాలను ఇంకా కొనసాగించే అవకాశం ఉంది.

తేరుకోని విశాఖ

తేరుకోని విశాఖ

అందాలకు ప్రతీక అయిన విశాఖనగరం తుఫాను తాకిడికి విలవిలలాడింది. ఆహారం కోసం బాధితులు ఇలా క్యూ కట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+