నిమజ్జనంలో కోదండVsఅశోక్! (పిక్చర్స్)
వినాయక నిమజ్జనంలో 'రాజకీయం - విభజన' కనిపించింది. భక్తుల పూజలు అందుకున్న గణనాథుడు బుధవారం నిమజ్జనం కోసం సాగర తీరం తరలి వెళ్లాడు. ఈ సమయంలో కొందరు భక్తులు గణనాథుడికి జై కొట్టడంతో పాటు తమ తమ పార్టీ నేతలకు అనుగుణంగా, సమైక్య, తెలంగాణలకు అనుకూలంగా జోరుగా నినాదాలు చేశారు.
హైదరాబాదులో జరిగిన నిమజ్జనం కార్యక్రమంలో ప్రధానంగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నినాదాలు మారుమోగాయి. అలాగే జై తెలంగాణ నినాదాలు వినిపించాయి. సీమాంధ్ర జిల్లాల్లో జరిగిన వినాయక ఉత్సవాల్లోను సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటాయి. నిమజ్జనానికి తరలించే గణనాథుడి వాహనాలను పార్టీల జెండాలతో కూడా అలంకరించారు.
అయితే, నిమజ్జనంలో ఆయా పార్టీల నాయకులకు జై కొట్టడాలను మరికొందరు తప్పుపడుతున్నారు. ఇది అందరి పండుగ అని, అలాంటప్పుడు నాయకులకు, ఇతర అంశాలను ఇందులోకి తీసుకు రావొద్దని కొందరు అంటున్నారు. నిమజ్జనంలో బిజెపి శ్రేణుల మోడీ జపంపై సిపిఐ నారాయణ, సిపిఎం రాఘవులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిమజ్జనంలో అశోక్ వర్సెస్ కోదండ!
వినాయక నిమజ్జనం సందర్భంగా తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్, ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు రూపాల్లో బాక్సింగ్ దృశ్యం.

నిమజ్జనంలో
వినాయక నిమజ్జనం సందర్భంగా తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్, ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు రూపాల్లో బాక్సింగ్ చేస్తున్న దృశ్యం. వెనుక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుల ముఖచిత్రాలతో..

సామరస్యం
నిమజ్జనం కోసం చార్మినార్ మీదుగా వెళ్తున్న లంబోదరులను ఆసక్తిగా తిలకిస్తున్న ఓ ముస్లిం. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో అన్ని వర్గాల వారు పాల్గొన్నారు.

నిమజ్జనంలో తెలంగాణం
బుధవారం రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జరిగిన నిమజ్జన కార్యక్రమంలో తెలంగాణ పటాన్ని ప్రదర్శిస్తున్న తెలంగాణవాదులు. '29వ రాష్ట్రం తెలంగాణ శుభాకాంక్షలు' అంటూ ప్రదర్శించిన దృశ్యం.

తెలంగాణ 'భక్తి'
బుధవారం రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జరిగిన నిమజ్జన కార్యక్రమంలో తెలంగాణ పటాన్ని ప్రదర్శిస్తున్న తెలంగాణవాదుల దృశ్యం.

నిమజ్జనం
వినాయక సాగర్(హుస్సేన్ సాగర్)లో నిమజ్జనానికి వెళ్తుండగా పలుచోట్ల భాజపా శ్రేణులు నరేంద్ర మోడికి అనుకూలంగా నినాదాలు చేశారు.
-
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !!












Click it and Unblock the Notifications