బాబుతో పేచీలు లేవట: ఉమాభారతితో కెసిఆర్ భేటీ
న్యూఢిల్లీ: ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇబ్బందులేవీ ఉండవని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో చెప్పారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో ఏమైనా ఇబ్బందులుంటాయా అని ఉమా భారతి అడిగినప్పుడు ఆయన ఆ విధంగా అన్నారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు ప్రాణహిత-చేవెళ్లను కూడా చేపట్టింది ఆంధ్రా పాలకులేనని, దీనికోసం ఇప్పటి వరకూ రూ.4వేల కోట్లు కూడా ఖర్చు చేశారని కెసిఆర్ చెప్పారు. అందువల్ల ఏపీకి ఎలాంటి అభ్యంతరాలూ ఉండవని తెలిపారు. పోలవరం వల్ల మీకేమైనా సమస్య ఉందా? అని ఉమా భారతి ప్రశ్నించారు. ఎలాంటి సమస్యా లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. అంతేకాకుండా, విభజన సమస్యలపై ఏ విధమైన పేచీలు లేవని, ఎపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో మాట్లాడాల్సిన అవసరం లేదని కెసిఆర్ మీడియాతో చెప్పారు. రాష్ట్ర విభజన చట్టం స్పష్టంగా ఉందని ఆయన చెప్పారు.
దేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలని మేం నిర్ణయించామని, ఇందులో భాగంగా తెలంగాణలోని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే, ఈ ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్ సమస్యను మీరు పరిష్కరించుకోవాలని, ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు అందజేస్తే వెంటనే జాతీయ హోదా ఇచ్చేలా నేను చర్యలు తీసుకుంటానని ఉమా భారతి కెసిఆర్‌తో చెప్పారు. తెలంగాణలోని నీటి ప్రాజెక్టులకు కేంద్ర సాయాన్ని కోరుతూ.. పార్టీ ఎంపీలు, సీఎస్ రాజీవ్ శర్మ, ప్రత్యేక ప్రతినిధులు రామచంద్రు తేజావత్, వేణుగోపాలాచారిలను వెంటబెట్టుకుని సోమవారం మధ్యాహ్నం ఉమాభారతిని ఆమె కార్యాలయంలో సీఎం కేసీఆర్ కలిశారు.
ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వాలని కేసీఆర్ ఆమెను కోరారు. ఈ ప్రాజెక్టు నిర్వహణకు 4-5 వేల మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని తనకు తెలిసిందని అంటూ అంత విద్యుత్‌ను ఎలా సమకూర్చుకుంటారని ఉమా భారతి కెసిఆర్‌ను ప్రశ్నించారు. విద్యుత్ అంశాన్ని పరిష్కరించుకోవాలని సూచించారు. విద్యుత్ సమస్యను పరిష్కరించుకునే అంశం రాష్ట్రానిదేనని, దీనికి కేంద్రంతో సంబంధం లేదని చెప్పారు. విభజన చట్టం కింద కేంద్రం 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును తెలంగాణలో ఏర్పాటు చేయాల్సి ఉందని, మరో వెయ్యి మెగావాట్లను తాము ఛత్తీస్‌గఢ్ నుంచి కొనుగోలు చేయనున్నామని తెలిపారు. దీనిపై కేంద్ర-రాష్ట్ర అధికారులతో మరో వారం రోజుల్లో భేటీ ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇదే అంశంపై ఆమె సీఎస్ రాజీవ్‌శర్మతోనూ మాట్లాడారు. విద్యుత్‌కు సంబంధించి రాష్ట్రం స్పష్టమైన సమాచారాన్ని ఇవ్వాలన్నారు.

దేవాదుల పథకానికి సబంధించి ఏఐబీపీ కింద నిధులు మంజూరు చేయాలని ఉమాభారతిని కేసీఆర్ కోరారు. తొలి విడత కింద మరో వారం రోజుల్లో రూ.64 కోట్లు విడుదల చేస్తామని ఆమె చెప్పారు. మరో రూ.160 కోట్లకు పైగా నిధుల్ని కూడా త్వరగా విడుదల చేయాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మిషన్ కాకతీయ పేరిట పెద్ద ఎత్తున చెరువులు, కుంటల పునరుద్ధరణ చేపడుతున్నామని, దీనికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని కోరారు. మిషన్ కాకతీయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆమెను కేసీఆర్ కోరారు. వీలు చూసుకుని తప్పకుండా వస్తానని ఆమె హామీ ఇచ్చారు.
కేసీఆర్‌తో భేటీ అనంతరం ఉమాభారతి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రాణహిత-చేవెళ్ల, పోతిరెడ్డిపాడు, మిషన్ కాకతీయకు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తులపై సానుకూల వైఖరిని తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ రాష్ర్టానికి తమ శాఖకు సంబంధించి పూర్తి మద్దతు ఇస్తామని అన్నారు. తెలంగాణలో 45 వేల పైచిలుకు చెరువులు, కుంటల్ని బాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు హాజరు కావాల్సిందిగా ఉమాభారతిని ఆహ్వానించామని టిఆర్ఎస్ ఎంపి కల్వకుంట్ల కవిత తెలిపారు. అలాగే, సాంకే తికాంశాలను పరిష్కరించుకుంటే ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా వస్తుందని ఉమా భారతి చెప్పారని కవిత తెలిపారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications