'పవర్' గురించి మాట్లాడిన రజనీకాంత్, కానీ
సూపర్ స్టార్ రజనీకాంత్ 'పవర్' గురించి మాట్లాడారు. అయితే ఆయన మాట్లాడింది.. అధికారం అనే పవర్ గురించి కాదు. మనలో ఉంటే ఆధ్యాత్మిక పవర్ గురించి.
చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ 'పవర్' గురించి మాట్లాడారు. అయితే ఆయన మాట్లాడింది.. అధికారం అనే పవర్ గురించి కాదు. మనలో ఉంటే ఆధ్యాత్మిక పవర్ గురించి. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా లేదా? అన్నది ఎప్పటికీ మిలియన డాలర్ల ప్రశ్నే.
పరమహంస యోగానంద రచించిన 'ది డివైన్ రొమాన్స్' తమిళ అనువాదం 'దైవీక కాదల్' పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం నాడు చెన్నైలో జరిగింది. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం రజనీకాంత్ మాట్లాడారు.
పవర్ అంటే తనకూ ఇష్టమేనని చెప్పారు. కానీ, అది అందరూ ఊహించే పవర్ కాకుండా ఆధ్యాత్మికతకు సంబంధించినదని వ్యాఖ్యానించారు. తాను ఒక నటుడిగా, సూపర్‌స్టార్‌గా చెప్పుకోవడం కంటే, ఆధ్యాత్మికవేత్తగా చెప్పుకోవడానికే గర్వపడతానన్నారు.

డబ్బు, పేరు కావాలా.. ఆధ్యాత్మికత కావాలా? అనడిగితే ఆధ్యాత్మికతనే కోరుకుంటానని చెప్పారు. ఆధ్యాత్మికత చాలా పవర్‌ఫుల్ అని, తాను పవర్‌ని ఇష్టపడతానని వ్యాఖ్యానించారు. పవర్ అంటే తప్పుగా అనుకోవద్దని, ఇది ఆధ్యాత్మికత పవర్ అన్నారు.
క్రియా యోగంతో నా జీవితమే మారిపోయిందని చెప్పారు. సామాన్య ప్రజలకు ఆధ్యాత్మికతను చేరువ చేయాలని ఉద్దేశంతో చెప్పినదే ధ్యానం. మన ఇంటికి ఒక అతిథి వస్తున్నాడంటే ఇల్లంతా ఎంతో శుభ్రంగా ఉంచుతామని, అలాంటిది దేవుడు మన మనసులోకి రావాలంటే మనం ఇంకెంత శుద్ధంగా ఉండాలన్నారు.
మనమందరం దుర్యోధనులమేనని, దుర్యోధనుడి వలె మనకీ ఏది మంచో, ఏది చెడో తెలుసునని కానీ, పాటించలేమన్నారు. అబద్ధం చెప్పకూడదని తెలిసి అబద్ధం చెబుతామని, మనం దుర్యోధనులం కాకుండా శ్రీకృష్ణ పరమాత్ముడికి తనను తాను అర్పించి పరిశుద్ధుడైన అర్జునుడిగా మారుదామని రజనీకాంత్ అన్నారు.
తన సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్ తొలి గురువు అని, ఆ తర్వాత ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైందని తెలిపారు. రామకృష్ణ పరమహంస నుంచి క్రమశిక్షణ, రాఘవేంద్రస్వామి నుంచి భక్తి, రమణ మహర్షి నుంచి 'ఎవరు నేను' అనే విషయం, దయానంద సరస్వతి నుంచి సాంఘిక అంశాలు నేర్చుకున్నానని చెప్పారు. తన ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగుతోందన్నారు.












Click it and Unblock the Notifications