రాహుల్ ఇలా చేశాడేంటి?: అమ్మ అంత్యక్రియల్లో నవ్వులు(వీడియో)
విషన్న వదనాలతో అమ్మకు ఆఖరికి వీడ్కోలు చెబుతున్న సమయంలో.. రాహుల్ గాంధీ నవ్వుతూ కనిపించడం.. ఆయనపై విమర్శలకు కారణమవుతోంది.
చెన్నై: అమ్మ అస్తమయంలో తమిళనాట నెలకొన్న విషాద ఛాయలు ఇంకా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అమ్మ మరణానికి సంబంధించిన షాక్ నుంచి ఆమె అభిమానులు ఇంకా తేరుకోలేకపోతున్నారు.
కాగా, అమ్మ అంత్యక్రియలు జరుగుతున్న సందర్బంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యవహరించిన తీరు ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. విషన్న వదనాలతో అమ్మకు ఆఖరికి వీడ్కోలు చెబుతున్న సమయంలో.. రాహుల్ గాంధీ నవ్వుతూ కనిపించడం.. ఆయనపై విమర్శలకు కారణమవుతోంది.
అమ్మ అంత్యక్రియల్లో రాహుల్ గాంధీ నవ్వుతూ కనిపించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై నెటిజెన్స్ సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. ఓపక్క విషాద వాతావరణాన్ని చూస్తూనే.. రాహుల్ ఇలా నవ్వడాన్ని నెటిజెన్స్ తప్పుబడుతున్నారు.












Click it and Unblock the Notifications