రామోజీ రావు, జగన్ చేతులు కలిపారు (ఫోటో)

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఈనాడు ఎడిటర్ రామోజీ రావులు ముచ్చట్లు పెట్టుకున్నారు. మంచు మనోజ్ వివాహం ప్రణతితో జరుగుతోంది. ఈ వివాహానికి పలువురు ప్రముఖులు విచ్చేశారు.

ఈ వివాహమహోత్సవానికి జగన్, రామోజీ రావు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు, సూపర్ స్టార్ రజనీకాంత్, ఎంపీలు మురళీ మోహన్, తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, మాజీ ఎంపీ సుబ్బిరామి రెడ్డి, జగన్ తల్లి విజయమ్మ తదితరులు హాజరయ్యారు.

Ramoji Rao shakes hand with YS Jagan

ఈ సందర్భంగా రామోజీ రావు, జగన్‌లు మాట్లాడుకున్నారు. ముందే వచ్చి రామోజీ రావు ఓ చోట కూర్చున్నారు. ఆ తర్వాత అక్కడకు జగన్ వచ్చారు. ఈ సందర్భంగా రామోజీ రావు లేచి జగన్‌తో చేయి కలిపారు. అనంతరం నవ్వుతూ మాట్లాడుకున్నారు.

బుధవారం ఉదయం 9 గంటల 10 నిమిషాలకు పెళ్లి తంతు ఉంది. పెళ్లి జరుగుతున్న ఈ రోజే మనోజ్‌ పుట్టినరోజు కూడా కావడం విశేషం. దీంతో మంచువారింట ఒకేరోజు రెండు వేడుకలు.

పెళ్లికి ముందు నిర్వహించే సంగీత్ సెర్మీ పార్క్ హయత్ హోటల్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీతారలు హాజరై సందడి చేసారు. డాన్స్ చేసి అదరగొట్టారు. గత పది రోజుల నుండి పెళ్లి సంబరాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్లో ఎక్కడ చూసినా మంచు మనోజ్ పెళ్లి వేడుక గురించే చర్చించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+