వివాదాల పుట్ట: ఎవరీ సంత్ రాంపాల్?

చండీఘడ్: అకస్మాత్తుగా హర్యానా ప్రధాన వార్తలకు కేంద్రంగా మారింది. వివాదాస్పద స్వామీజీ సంత్ రాంపాల్ పోలీసులకే సవాల్ విసరడంతో దేశ ప్రజలు ఒక్కసారిగా అటువైపు చూశారు. అతని అనుచరులు పోలీసులపై సమరానికి దిగారు. అతన్ని అదుపులోకి తీసుకోవడం పోలీసులకు సవాల్‌గా మారింది. దాంతో ఎవరీ రాంపాల్ అనే ఆసక్తి పెరిగింది.

సంత్ రాంపాల్ ఒకప్పుడు హర్యానా ప్రభుత్వం జూనియర్ ఇంజనీరుగా పనిచేసేవాడు. 2000 వరకు రాంపాల్ అనే ఈ స్వామీజి రాంపాల్ సింగ్ జతిన్ హర్యానా నీటి పారుదుల శాఖలో జూనియర్ ఇంజనీరుగా పనిచేశాడు. పనిపై ఏ మాత్రం శ్రద్ధ పెట్టేవాడు కాదంటారు. అతను తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. 1995 నుంచి అమలుకు వచ్చేలా 2000లో అతని రాజీనామాను ప్రభుత్వం అంగీకరించింది.

పూర్తి స్థాయి బాబాగా మారిపోయిన రాంపాల్ పలు నాన్ బెయిలబుల్ వారంట్లు జారీ చేసినప్పటికీ హైకోర్టు ముందు హాజరు కావడానికి నిరాకరించాడు. కోర్టు ఆదేశాల మేరకు అతన్ని అదుపులోకి తీసుకోవడానికి వెళ్లిన భద్రతా బలగాలకు చుక్కెదురు కావడమే కాదు, అదో సవాల్‌గా మారింది. అతని అనుచరులు మంగళవారం భద్రతా బలగాలపై సమరం ప్రకటించారు. పోలీసులపైకి కాల్పులు జరిపారు.

Rampal: A self-styled godman who was once an engineer

రాంపాల్ 1951 సెప్టెంబర్ 8వ తేదీన హర్యానాలోని సోనీపట్ జిల్లా గోహానా పట్టణం సమీపంలోని ధనానా గ్రామంలో జన్మించాడు. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం అతనిది వ్యవసాయ కుటుంబం. ఇంజనీరింగ్ డిప్లమా చేసిన అతను జూనియర్ ఇంజనీరుగా ఉద్యోగంలో చేరాడు. అయితే, సహజంగా అతనికి భక్తి ఎక్కువ అని అంటారు.

ఓ వర్గం ప్రజల్లో రాంపాల్‌కు విపరీతమైన ఆదరణ ఉంది. దేవుళ్లను పూజించవద్దని, ఉపవాస దీక్షలు చేయవద్దని, ఇతర ఆచారాలను పాటించవద్దని, అదే హిందూ మతమని అతను బోధిస్తూ వస్తున్నాడు. వివాదాలు రాంపాల్‌కు కొత్తేమీ కాదు.

మతపరమైన గ్రూపులతో ఘర్షణ కారణంగా 2006 జులైలో అతను హర్యానాలోని రోహతక్ జిల్లా కరోంతాలో ఏర్పాటు చేసుకున్న ఆశ్రమాన్ని ఖాళీ చేయాల్సివచ్చింది. బుల్లెట్ గాయాలతో 2006లో కొరాంత ఆశ్రమం వద్ద ఓ వ్యక్తి మరణించాడు. రాంపాల్‌ను హత్య కేసులో పోలీసులు చేర్చారు. తప్పుడు కేసులో అతన్ని ఇరికించారని అతని వర్గానికి చెందినవారు ఆరోపిస్తూ వస్తున్నారు.

ఈ ఏడాది జులైలో అతను హిస్సార్ పట్టణంలోని కోర్టుకు వెళ్తుండగా అతని అనుచరులు, మద్దతుదారులు విధ్వంసానికి దిగారు. దీంతో పంజాబ్, హర్యానా హైకోర్టు సూమోటాగా నోటీసును తీసుకుని రాంపాల్‌కు సమన్లు జారీ చేసింది. వివాదాస్పద రాంపాల్ బాబా కోర్టు ముందు హాజరు కాలేదు. అతనిపై కోర్టు నవంబర్ 5వ తేదీన నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఆరోగ్య కారణాలను చూపుతూ అతను నవంబర్ 10వ తేదీన, ఆ తర్వాత 17వ తేదీన కోర్టుకు హాజరు కాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+