రోహిత్ ఆత్మహత్య: కెసిఆర్ మౌనం వెనక..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థుల పాత్ర విస్మరించరానిది. అయినప్పటికీ రోహిత్ ఆత్మహత్యపై తెలంగాణ అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు ఆశ్చర్యకరంగా మౌనం వహిస్తున్నారు. నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి కార్యకర్తలు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఇంటిని ముట్టడించారు.
కల్వకుంట్ల కవిత, ఎస్సీ సంక్షేమ సంస్థ చైర్మన్ పడిమర్తి రవి, పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర రెడ్డి మాత్రం ఆ విషయంపై మాట్లాడారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్ దళితుడు కాకపోవచ్చునని కొండా విశ్వేశ్వర రెడ్డి ఓ జాతీయ టీవీ చానెల్ కార్యక్రమంలో అన్నారు. ఈ వింత మౌనం వెనక ఉన్న కారణం తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశాలే కారణమని అంటున్నారు.
రోహిత్ ఆత్మహత్యపై తెలంగాణ నిఘా విభాగం అధికారులు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మంగళవారంనాడు సవివరమైన నివేదికను సమర్పించారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, తదితరులపై నమోదైన కేసుల గురించి కూడా వివరించారు. అంతా విన్న కెసిఆర్ దానిపై ఏమీ మాట్లాడలేదని అంటున్నారు. రోహిత్ ఆత్మహత్య సంఘటనపై ప్రతిస్పందిస్తే మాటల యుద్ధానికి దారి తీస్తుందని, అది జిహెచ్ఎంసి ఎన్నికల్లో నష్టం కలిగించవచ్చునని కెసిఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రోహిత్ ఆత్మహత్య సంఘటనపై మాట్లాడవద్దని కెసిఆర్ మంత్రులకు, తెరాస సీనియర్ నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటనపై మాట్లాడడానికి కొండా విశ్వేశ్వర రెడ్డికి మాత్రమే ఆయన అనుమతి ఇచ్చినట్లు చెబుతున్నారు.
దాంతో కొండా విశ్వేశ్వర రెడ్డి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు చెందిన ఇద్దరు అధికారులతో మాట్లాడినట్లు చెబుతున్నారు. సంఘటనపై ద్విసభ్య కమిటీ సరిపోదని, ఐదుగురు సభ్యులతో కమిటీ వేయాలని, ఇందులో విద్యార్థి ప్రతినిధులకు కూడా చోటు కల్పించాలని ఆయన చెప్పినట్లు సమాచారం.
రోహిత్ ఆత్మహత్య సంఘటన అత్యంత సున్నితమైందని, దాని పట్ల జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని తెరాస నాయకులు అంటున్నారు. సంఘటనపై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని సూచించాల్సిందిగా మాయావతి నేతృత్వంలోని బిఎస్పీ నాయకులు ఇద్దరు హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డిని కోరారు. ఆ వినతిపత్రాన్ని కేంద్రానికి పంపిస్తానని నాయిని నర్సింహారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం సిబిసిఐడికి అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications