ఏపీ, తెలంగాణల మధ్య పదో షెడ్యూల్‌లోని సంస్ధల చిచ్చు
హైదరాబాద్: రాష్ట్ర విభజన తర్వాత ఏదో ఒక అంశంపై తెలుగు రాష్ట్రాలు గొడవపడుతూనే ఉన్నాయి. మొన్నటి మొన్న ఓటుకు నోటు.. నిన్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నిర్మిస్తున్న ప్రాజెక్టులు... తాజాగా 10వ షెడ్యూల్‌లోని సంస్ధలు. 10వ షెడ్యూల్‌లోని సంస్ధలు ఉమ్మడి ఆస్తులంటా ఏపీ ప్రభుత్వం రాసిన లేఖలపై తెలంగాణ సర్కార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
పది షెడ్యూళ్లలోని సంస్ధల ఆస్తులు ఇరు రాష్ట్రాలకు చెందుతాయని, వాటిని జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతులను జత చేస్తూ ఏపీ ప్రభుత్వం తెలాగణ ప్రభుత్వానికి లేఖలు రాసింది.

అంతేకాదు అవే ప్రతులను 10వ షెడ్యూల్‌లోని అన్ని సంస్ధల అధిపతులకూ పంపింది. పదో షెడ్యూలులోని సంస్థలు ఉమ్మడి ఆస్తులేనని, వాటిని జనాభా ప్రాతిపదికన 58:42 నిష్పత్తిలో పంచుకుందామని పేర్కొంటూ ఆయా సంస్థల అధిపతులకు ఏపీ ప్రభుత్వం నుంచి గత 10-15 రోజులుగా లేఖలు అందుతున్నాయి.
ఇలా ఇప్పటివరకు 100కు పైగా సంస్థలకు ఈ లేఖలు అందాయి. ఈ క్రమంలో ఇలా లేఖలు రాయడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా తప్పుబడుతోంది. 'ఏపీ లేఖలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లేఖలు అందుకున్న అధిపతులు ప్రభుత్వానికి వెంటనే సమాచారం అందించాలి' అంటూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.
పదో షెడ్యూలులోని సంస్థల పరిపాలనను సంయుక్తంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం వాదిస్తుంటే... తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏపీ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని 75వ సెక్షన ప్రకారం పదో షెడ్యూలులోని సంస్థలు భౌగౌళికత ఆధారంగా తెలంగాణవేనని, ఏపీ ప్రభుత్వం ఆ సంస్థల సేవలను వినియోగించుకోవచ్చునని వాదిస్తోంది.
ఇలా ఏపీ, తెలంగాణల మధ్య వివాదం కొనసాగుతుండగా.. ఏపీ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న పదో సంస్ధల అధిపతులకు లేఖలు రాయడం చర్చనీయాంశమైంది. ఈ విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్ సింగ్‌కు లేఖ రాశారు.
ఈ లేఖలో సైతం 10వ షెడ్యూల్‌లోని సంస్ధలపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన పున:సమీక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిందని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌కు మద్దతుగా కేంద్రం కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని అందులో కోరారు.












Click it and Unblock the Notifications