దుమారం: నాడు వైఎస్ వీసా, నేడు బాబు విదేశీ
హైదరాబాద్: హైదరాబాద్ నుంచి పాలన సాగిస్తుంటే విదేశాల నుంచి సాగిస్తున్నట్లు ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఆయన విదేశీ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది. నమస్తే తెలంగాణ దినపత్రిక ఏకంగా చంద్రబాబుపై దుమ్మెత్తిపోస్తూ ఓ వార్తాకథనం ప్రచురించింది. రాష్ట్రం విడిపోతే తెలంగాణకు వెళ్లాలంటే వీసా తీసుకోవాలని అప్పట్లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి చేసిన వ్యాఖ్యను గుర్తు చేస్తూ చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఆనాడు వైఎస్, ఇప్పుడు చంద్రబాబు.. ఆంధ్ర నాయకులంతా ఒకే తీరుగా ఉన్నారని తెలంగాణ వాదులు మండిపడుతున్నారని నమస్తే తెలంగాణ దినపత్రిక వ్యాఖ్యానించింది. తెలంగాణను విదేశంతో పోల్చడం అంటే ఈ ప్రాంతం దేశంలో అంతర్భాగం కాదన్నట్లు భావించడమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మండిపడింది.

నమస్తే తెలంగాణ వార్తాకథనం ఇలా సాగింది - తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చివరి నిమిషంలో కూడా అడ్డుకున్నారన్న అపప్రథ మోస్తున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి తెలంగాణపై తన వ్యతిరేక భావాన్ని బయటపెట్టుకున్నారు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హైదరాబాద్‌కు వెళ్లాలంటే వీసాలు కావాల్సి వస్తుందని వ్యాఖ్యానించగా, మరో అడుగు ముందుకేసిన చంద్రబాబు ఏకంగా తెలంగాణను విదేశంతో పోల్చారు.
ప్రజలంతా అక్కడ ఉంటే తాను హైదరాబాద్‌లో ఉండి ఏపీని పరిపాలించడం వేరే దేశంలో ఉండి పరిపాలించినట్లు ఉందని విపరీత వ్యాఖ్యలు చేశారు. అందుకే ఇకపై వారంలో నాలుగైదు రోజులు విజయవాడలోనే ఉంటానని చెప్పారు. విజయవాడ తాత్కాలిక రాజధానిగా ఉంటుందని తెలిపారు. అక్కడే మినీ అసెంబ్లీ నిర్మిస్తామని చెప్పారు. విజయవాడలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు ఉద్యోగ నేతలకు వెల్లడించారు.

పీఆర్సీపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతుండగా జోక్యం చేసుకున్న చంద్రబాబు - ఇక్కడ జీతాలకే డబ్బుల్లేవు. తీవ్ర ఇబ్బందులున్న ఈ సమయంలో మీరు పీఆర్సీ అడుగుతున్నారా? అంటూ ఆశ్చర్యార్థకంగా చూశారని తెలిసింది. దీంతో కొంత ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇబ్బందికి గురయ్యారు. ఆ తరువాత సీఎం జోక్యం చేసుకొని పీఆర్సీపై నిర్ణయం తీసుకోవడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తామని వారికి హామీ ఇచ్చారని సీఎంను కలిసిన నాయకుడొకరు తెలిపారు.
ఉపసంఘం సిఫార్సును బట్టే పీఆర్సీ అంశం ఉంటుందని వారికి స్పష్టం చేశారు. తాత్కాలిక రాజధానిలో ఉద్యోగులకు యుద్ధ ప్రాతిపదికన ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. వారంలో ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు జారీచేస్తామని భరోసా ఇచ్చారని విశ్వసనీయవర్గాలు చెప్పాయి.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications