ఆ తారల ఇళ్లపై ఐటి సోదాలు: చిక్కిన వంద కోట్లు
చెన్నై: తమిళ సినీ హీరో విజయ్, హీరోయిన్లు సమంత, నయనతారల ఇళ్లపై జరిగిన సోదాల్లో దిమ్మతిరిగే ఆస్తులు వెల్లడైనట్లు సమాచారం. తారల ఇళ్లపైనే కాకుండా ఐటి అధికారులు బుధవారంనాడు నిర్మాతలు, ఫైనాన్షియర్లు, దర్శకుల ఇళ్లలో, కార్యాలయాల్లో బుధవారంనాడు దాడులు నిర్వహించారు.
ఐటి అధికారుల దాడుల్లో వంద కోట్ల రూపాయల విలువైన నగలు, నగదు ఐటి అధికారులకు లభ్యమైనట్లు తెలుస్తోంది. విజయ్‌కి చెందిన బంగళాల్లో, కోడంబాక్కంలోని పులి చిత్ర దర్శకుడు సింబుదేవన్ నివాసంలో, ఆ సినిమా నిర్మాతల్లో ఒక్కరైన పిటి సెల్వకుమార్ నివాసంలో, పల్లావరంలోని నటి సమంత నివాసం, హైదరాబాద్, తిరువనంతపురం, కొచ్చిల్లోని నయనతార నివాస గృహంలో ఐటి అధికారులు సోదాలు చేశారు.

ఈ దాడుల్లో వంద కోట్లకు చెందిన కీలకమైన పత్రాలను ఐటి అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం 32 చోట్ల ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. పులి చిత్రానికి బ్లాక్ మనీ వాడారనే సమాచారం రావడంతో ఈ దాడులు నిర్వహించారు.
ఈ సినీ తారలు క్రమం తప్పకుండా ఐటి రిటర్న్స్ దాఖలు చేస్తున్నారా, లేదా అనే విషయంపై కూడా ఐటి అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. వంద కోట్ల రూపాయల వ్యయంతో పులి సినిమాను తీశారు.












Click it and Unblock the Notifications