నాన్న చెప్పారు.. దూరం దూరం: సచిన్ టెండుల్కర్
కోచి: రెండు దశాబ్దాలకు పైగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ఎంతోమందికి ఆదర్శం. పలు వాణిజ్య ప్రకటనలలో కనిపించారు. అలాంటి సచిన్ శనివారం మాట్లాడుతూ... తాను పొగాకు, మద్యానని ఎప్పుడు ప్రోత్సహించలేదని, దానికి తాను బ్రాండ్ అంబాసిడర్ అని అభిప్రాయపడ్డారు.
పొగాకు ఉత్పత్తులు, మద్యం వినియోగాన్ని ప్రోత్సహించే వాణిజ్య ప్రకటనల్లో ఎప్పుడూ చేయనన్నారు. పొగాకు, మద్యం ఉత్పత్తులను ప్రోత్సహించకని తన తండ్రి చెప్పారని, అందువల్ల వాటికి దూరంగా ఉంటానని సచిన్ టెండుల్కర్ చెప్పారు.
అంతర్జాతీయ ప్రకటనా సంస్థల సిల్వర్ జుబ్లి ముగింపు సమావేశంలో తెలిపారు. క్రీడాకారునిగా తన అనుభవాలను చెప్పారు. లక్ష్యాన్ని చేరుకునేంత వరకు వదలకూడదని యువతకు సూచించారు. క్రికెట్ ఆడుతున్న సమయంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయన్నారు.

నమ్మకస్తుల సహాయంతో సమస్యలను పరిష్కరించడానికి యత్నించేవాడినన్నారు. కొన్నిసార్లు ఎక్కువ కష్టపడుతున్నానని అనుకునే వాడినని, కాని అప్పుడు వెనకడుగు వేయలేదన్నారు. ఒక అడుగు ముందుకు వేయడం వల్లే విజయం దరి చేరిందన్నారు.
ఇదిలా ఉండగా, పానన్ గడ్‌లో నీటి ఒడ్డున 5 వేల చదరపు అడుగుల్లో నిర్మించిన విలాసవంతమైన విల్లాను సచిన్ కొన్నారు. విల్లాను చూడటానికి పడవలో ప్రయాణించారు. కేరళలోని ప్రకృతి అందాలు చూసేందుకు వస్తుంటానని, రాబోయే కాలంలో ఇక్కడే ఎక్కువ కాలం గడుపుతానని చెప్పారు.












Click it and Unblock the Notifications