వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇళవరసి గుప్పిట్లో శశికళ!: మన్నార్‌గుడి మాఫియాలో మొత్తం 17మంది

శశికళ జయలలితను ఏవిధంగానైతే నియంత్రించారో.. ఇప్పుడదే రీతిలో శశికళను ఆమె వదిన ఇళవరసి తన గుప్పిట్లో పెట్టుకున్నారన్నది ఆ చర్చల సారాంశం.

|
Google Oneindia TeluguNews

చెన్నై: 'మన్నార్‌గుడి మాఫియా' ఒకప్పుడు పొయెస్ గార్డెన్ లో తిష్టవేసి.. అమ్మ ఆగ్రహానికి గురై అక్కడి నుంచి బహిష్కరించబడిన సంగతి తెలిసిందే. అమ్మ అస్తమయం తర్వాత పొయెస్ గార్డెన్ లోకి మన్నార్ గుడి మాఫియా మళ్లీ ఎంటరైంది.

తమిళ రాజకీయాల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో.. ఈ పేరు చుట్టు ముడిపడివున్న పలు ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి.

 మన్నార్‌గుడి మాఫియా:

మన్నార్‌గుడి మాఫియా:

తమిళ దివంగత సీఎం జయలలిత తన కుటుంబ సభ్యులను ఎంతదూరం పెట్టారో.. నెచ్చెలి శశికళను అంత అక్కున చేర్చుకున్నారు. శశికళ ద్వారా ఆమె వదిన ఇళవరసి, ఆమె కుటుంబ సభ్యులైన 'మన్నార్‌గుడి మాఫియా' అంతా పొయెస్ గార్డెన్ లోనే తిష్టవేసే దాకా వచ్చింది.

శశికళ చెప్పిందే అమ్మకు వేదం:

శశికళ చెప్పిందే అమ్మకు వేదం:

అది ఎంత దూరం వెళ్లిందంటే.. ఏకంగా జయలలిత ప్రతీ కదలికను నియంత్రించేంతగా ప్రభావితం చేసింది. నెచ్చెలి శశికళ చెప్పిందే జయలలితకు వేదంగా మారింది. వ్యక్తిగత పనుల నుంచి పలు రాజకీయాంశాల దాకా శశికళ జయలలితను ప్రభావితం చేసినట్టుగా తెలుస్తోంది. తిండి, నిద్ర, నిర్ఱయాలు.. ఇలా ప్రతీ ఒక్కటి నెచ్చెలి శశికళ సూచనల మేరకే జయలలిత అనుసరించింది.

శశికళను గుప్పిట్లో పెట్టుకున్న ఇళవరసి:

శశికళను గుప్పిట్లో పెట్టుకున్న ఇళవరసి:

ఇదే సీన్ ఇప్పుడు శశికళ విషయంలోను రిపీట్ అవుతుందన్న చర్చ ప్రస్తుతం తమిళనాట జోరందుకుంది. శశికళ జయలలితను ఏవిధంగానైతే నియంత్రించారో.. ఇప్పుడదే రీతిలో శశికళను ఆమె వదిన ఇళవరసి తన గుప్పిట్లో పెట్టుకున్నారన్నది ఆ చర్చల సారాంశం. తమిళ మీడియా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుండటంతో.. ఇళవరసి చేతిలో శశికళ రిమోట్ కంట్రల్ లాగా మారిందన్న వార్తలకు మరింత ఊతం చేకూరుతోంది.

 'మన్నార్‌గుడి మాఫియా' భయంతోనే:

'మన్నార్‌గుడి మాఫియా' భయంతోనే:

జయలలిత మరణం తర్వాత సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన మన్నార్ గుడి మాఫియాలో ప్రస్తుతం 17మంది ఉన్నట్టుగా తమిళ మీడియా చెబుతోంది. జయలలిత పార్థివ దేహాన్ని ఉంచిన రాజాజీ హాల్లో.. ఆమె పార్థివదేహం చుట్టు ఆ 17మంది ఉన్నట్టుగా తమిళ మీడియా కథనాలు వెలువరించింది. వారి భయంతోనే జయ కుటుంబ సభ్యులెవరు పార్థివదేహం వద్దకు వచ్చే ప్రయత్నం చేయలేకపోయారని అక్కడి మీడియా అభిప్రాయపడుతోంది.

తమిళ మీడియా వెల్లడించిన 'మన్నార్‌గుడి మాఫియా' వివరాలు:

తమిళ మీడియా వెల్లడించిన 'మన్నార్‌గుడి మాఫియా' వివరాలు:

1. డాక్టర్ వెంకటేశన్ (శశికళ అన్న కొడుకు)
2. దినకరన్ (శశికళ అక్క కొడుకు)
3. శశికళ
4. పి. భాస్కర్ (డాక్టర్ వెంకటేశన్ మామ)
5. ఇళవరసి (శశికళ వదిన)
6. వివేక్ (శశికళ వదిన(ఇళవరసి) కొడుకు)
7. కార్తికేయన్ (ఇళవరసి అల్లుడు)
8. ప్రియ (ఇళవరసి కూతురు)
9. జై ఆనంద్ (శశికళ తమ్ముడు దివాకరన్ కొడుకు)
10. విక్రమ్ (శశికళ తమ్ముడు దివాకరన్ అల్లుడు)
11. భాస్కరన్ (శశికళ అక్క కొడుకు)
12. మధన్ (ఇళవరసి అన్న వడుగనాదన్ కొడుకు)
13. రాజరాజన్ (ఇళవరసి అల్లుడు)
14. డాక్టర్ శివకుమార్ (శశికళ అన్నకు అల్లుడు)
15. దివాకరన్ (శశికళ తమ్ముడు)
16. మహాదేవన్ (శశికళ అన్న కొడుకు)
17. నటరాజన్ (శశికళ భర్త)

English summary
Same scene was repeating now in tamilnadu AIADMK politics. After Jayalalithaas death Sasikala is like a remote control in Ilavarasi hands, Like Jayalalithaa-sasikala
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X