అసెంబ్లీలో టి బిల్లు వ్యతిరేకిస్తే..: ప్రణబ్‌పై ఆశలు

Seemandhra hopes on President
తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం తగ్గేది లేదని చెబుతున్న నేపథ్యంలో.. విభజన జరగడం, జరగకపోవడం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల్లోనే ఉందని కొందరు సీమాంధ్ర నేతలు భావిస్తున్నారు. రాష్ట్రపతి అనుకుంటే రాష్ట్ర విభజనను ఆపగలరని గట్టిగా నమ్ముతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను అమలు చేయడంలో రాష్ట్రపతి అధికారాలను గురించి తెలుసుకునేందుకు వారు ఇప్పటికే పలువురు రాజ్యాంగ నిపుణులను సంప్రదించారు.

ఆర్టికల్ 3 ప్రకారం బిల్లును అసెంబ్లీకి నివేదించడం రాష్ట్రపతి పరిధిలోనిదే. అందువల్ల, అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందకపోతే రాష్ట్రపతి తీసుకునే నిర్ణయమే కీలకమవుతుందని సీమాంధ్ర నేతలు వాదిస్తున్నారు. ఈ విషయంపై ప్రణబ్‌ని కూడా కొందరు సంప్రదించారని, బిల్లును అసెంబ్లీ ఆమోదించకపోతే ఏం చేయాలన్నది రాజ్యాంగ నిపుణులు నిర్వచించలేదన్న అభిప్రాయంతో ఆయన ఏకీభవించారని చెబుతున్నారు.

కీలకమైన సందర్భాల్లో, ముఖ్యంగా సంకీర్ణ రాజకీయాల్లో రాష్ట్రపతికి రాజ్యాంగం నిబంధనలను నిర్వచించే కీలక బాధ్యత ఉంటుందని వారు భావిస్తున్నారు. ఉదాహరణకు రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి... మొరార్జీ దేశాయ్‌కి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వకుండా చరణ్ సింగ్‌ను అధికారంలోకి ఆహ్వానించారు. 1998లో రాష్ట్రపతి కెఆర్ నారాయణన్ బిజెపి మెజారిటీ సీట్లు సాధించినప్పటికీ మిగతా పార్టీల నుంచి మద్దతు లేఖలు సమర్పించాలని వాజపేయిని కోరారు.

యుపిలో 1998లో కల్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని గవర్నర్ రమేశ్ భండారీ రద్దు చేసినప్పుడు హైకోర్టు కలుగచేసుకుని కల్యాణ్ సింగ్‌ను తిరిగి నియమించింది. అప్పుడు భండారీ రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. గుజ్రాల్ ప్రభుత్వం ఇందుకు అంగీకరించి రాష్ట్రపతి పాలన విధించాలని నిర్ణయించింది. దీనికి కెఆఱ్ నారాయణన్ నిరాకరించడంతో గవర్నరే రాజీనామా చేయాల్సి వచ్చింది.

వీటిని చూస్తుంటే మెజారిటీ అసెంబ్లీ సభ్యులు తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తే, అసెంబ్లీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆ బిల్లును పార్లమెంట్‌కు రాష్ట్రపతి పంపించబోరని సీమాంధ్ర నేతలు కొందరు విశ్వాసంతో ఉన్నారు. అయితే, రాజ్యాంగంలోని 44వ సవరణ ప్రకారం కేంద్ర కేబినెట్ అదే బిల్లును రెండోసారి పంపితే రాష్ట్రపతి ఆమోదించక తప్పదని తెలంగాణ నేతలు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+