ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్‌తో తుమ్మల: 2వేల కార్లలో నేతలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన వెంటనే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆయనకు ఖమ్మం జిల్లా నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. శుక్రవారం సాయంత్రం తుమ్మల భారీ సంఖ్యలో టిడిపి నేతలతో కలిసి టిఆర్ఎస్‌లో చేరారు. మంత్రి పదవి ఇస్తున్నట్టు కెసిఆర్ బహిరంగంగా చెప్పకున్నా.. ఇకపై తుమ్మల నాయకత్వంలోనే ఖమ్మం జిల్లాలో పార్టీ పని చేస్తుందని అన్నారు.

ఆయన నాయకత్వంలోనే జిల్లా అభివృద్ధి చెందుతుందని చెప్పడం ద్వారా పరోక్షంగా తుమ్మలకు మంత్రి పదవి ఇవ్వనున్నట్టు వెల్లడించారు. తుమ్మల, తాను 82నుంచి మిత్రులమని కేసిఆర్ అన్నారు. ‘1982లో ఇద్దరం పార్టీలో చేరాం, ఇద్దరం అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయామని గుర్తు చేశారు. ఎన్టీఆర్ తమకు అప్పుడు ఎమ్మెల్యే డి అని కార్డు ఇచ్చారని గుర్తు చేశారు. వేరువేరు పార్టీలైనా తామిద్దరం ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉన్నాం' అని చెప్పారు.

ఎన్నికలకు ముందే తుమ్మలను సంప్రదించినట్టు కేసిఆర్ తెలిపారు. ‘ఎలాగూ తెలంగాణ వచ్చింది. ఎన్నికల్లో మీరు విజయం సాధించబోతున్నారు. ఎన్నికల తరువాత చూద్దాం' అని తుమ్మల చెప్పినట్టు కేసిఆర్ తెలిపారు. ఇటీవల తుమ్మలను తానే సంప్రదించి, పార్టీలోకి ఆహ్వానించానన్నారు. తెలంగాణ ఏర్పడింది అనేది వాస్తవం. దీనిని దృష్టిలో పెట్టుకొని అందరం అభివృద్ధికి ఏకమవుదామని పిలుపునిచ్చారు. తుమ్మల నాయకత్వంలో జిల్లా అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నట్టు కేసిఆర్ తెలిపారు.

కెసిఆర్-తుమ్మల

కెసిఆర్-తుమ్మల

తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన వెంటనే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆయనకు ఖమ్మం జిల్లా నాయకత్వ బాధ్యతలు అప్పగించారు.

కెసిఆర్-తుమ్మల

కెసిఆర్-తుమ్మల

శుక్రవారం సాయంత్రం తుమ్మల భారీ సంఖ్యలో టిడిపి నేతలతో కలిసి టిఆర్ఎస్‌లో చేరారు.

కెసిఆర్-తుమ్మల

కెసిఆర్-తుమ్మల

మంత్రి పదవి ఇస్తున్నట్టు కెసిఆర్ బహిరంగంగా చెప్పకున్నా.. ఇకపై తుమ్మల నాయకత్వంలోనే ఖమ్మం జిల్లాలో పార్టీ పని చేస్తుందని అన్నారు.

కెసిఆర్-తుమ్మల

కెసిఆర్-తుమ్మల

ఆయన నాయకత్వంలోనే జిల్లా అభివృద్ధి చెందుతుందని చెప్పడం ద్వారా పరోక్షంగా తుమ్మలకు మంత్రి పదవి ఇవ్వనున్నట్టు వెల్లడించారు. తుమ్మల, తాను 82నుంచి మిత్రులమని కేసిఆర్ అన్నారు.

కెసిఆర్-తుమ్మల

కెసిఆర్-తుమ్మల

‘1982లో ఇద్దరం పార్టీలో చేరాం, ఇద్దరం అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయామని గుర్తు చేశారు. ఎన్టీఆర్ తమకు అప్పుడు ఎమ్మెల్యే డి అని కార్డు ఇచ్చారని గుర్తు చేశారు. వేరువేరు పార్టీలైనా తామిద్దరం ఎప్పుడూ మాట్లాడుకుంటూనే ఉన్నాం' అని చెప్పారు.

కెసిఆర్-తుమ్మల

కెసిఆర్-తుమ్మల

ఎన్నికలకు ముందే తుమ్మల నాగేశ్వర రావును సంప్రదించినట్టు తెలంగాణ సిఎం కేసిఆర్ తెలిపారు.

కెసిఆర్-తుమ్మల

కెసిఆర్-తుమ్మల

‘ఎలాగూ తెలంగాణ వచ్చింది. ఎన్నికల్లో మీరు విజయం సాధించబోతున్నారు. ఎన్నికల తరువాత చూద్దాం' అని తుమ్మల చెప్పినట్టు కేసిఆర్ తెలిపారు.

కెసిఆర్-తుమ్మల

కెసిఆర్-తుమ్మల

ఇటీవల తుమ్మలను తానే సంప్రదించి, పార్టీలోకి ఆహ్వానించానన్నారు. తెలంగాణ ఏర్పడింది అనేది వాస్తవం. దీనిని దృష్టిలో పెట్టుకొని అందరం అభివృద్ధికి ఏకమవుదామని పిలుపునిచ్చారు.

కెసిఆర్-తుమ్మల

కెసిఆర్-తుమ్మల

తుమ్మల నాయకత్వంలో జిల్లా అభివృద్ధి చెందుతుందని నమ్ముతున్నట్టు కేసిఆర్ తెలిపారు.

కెసిఆర్-తుమ్మల

కెసిఆర్-తుమ్మల

అమాయకులైన గిరిజనుల బతుకును దుర్భరంగా మార్చారని, వారిని రోడ్డుపాలు చేస్తున్నారని వారి ఉసురు తగులుతుందని తుమ్మల నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు.

కెసిఆర్-తుమ్మల

కెసిఆర్-తుమ్మల

తెలంగాణ ఏర్పడిన తరువాత కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణతో వ్యవహరించిన తీరు బాగాలేదని విమర్శించారు.

కెసిఆర్-తుమ్మల

కెసిఆర్-తుమ్మల

ఏడు ముంపు మండలాలను ఆంధ్రలో కలపడం తగదని, రెండున్నర లక్షల మంది గిరిజనులను రోడ్డు పాలు చేశారని అన్నారు.

కెసిఆర్-తుమ్మల

కెసిఆర్-తుమ్మల

విద్యుత్ ఒప్పందాల విషయంలో ఆంధ్ర వ్యవహరించిన తీరు సరికాదన్నారు. రాష్ట్రంలో జరిగిన పలు కీలక రాజకీయ పరిణామాల్లో కేసిఆర్ తాను భాగస్వాములుగా ఉన్నామని తుమ్మల తెలిపారు.

కెసిఆర్-తుమ్మల

కెసిఆర్-తుమ్మల

భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు రావడంతో తెలంగాణ భవన్ కిక్కిరిసింది. దాంతో కార్యకర్తలు తెలంగాణ భవన్ బయటే ఉండిపోయారు.

English summary
In a setback to the Telugu Desam Party in Telangana, senior party leader from Khammam district and former minister Tummala Nageswara Rao joined the ruling Telangana Rashtra Samiti on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X