Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సల్మాన్‌తో భేటీపై రాజకీయం: థాకరేపై బీజేపీకి రివర్స్

ముంబై: హిట్‌ అండ్‌ రన్‌ కేసులో ఐదేళ్ల జైలుశిక్ష పడి మధ్యంతర బెయిల్ పైన బయట ఉన్న సల్మాన్ ఖాన్‌ ఇంటికి ప్రముఖులు తరలి వస్తున్నారు. మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సమితి (ఎమ్మెన్నెస్) అధినేత రాజ్‌ థాకరే, బాంద్రా ప్రాంతంలోని సల్మాన్‌ నివాసానికి వచ్చారు. రాజ్‌ థాకరే, సల్మాన్ ఖాన్‌లు స్నేహితులు.

రాజ్ థాకరే... సల్మాన్ ఖాన్‌ను పరామర్శించడం పైన భాతీయ జనతా పార్టీ విమర్శలు గుప్పించింది. ముంబై బీజేపీ అధ్యక్షులు ఆశిష్ షేలార్.. రాజ్ థాకరే తీరును తప్పు పట్టారు. ఇది వ్యక్తిగత విషయం కాదని, కోర్టు నేరస్తుడిగా పేర్కొన్న వ్యక్తిని రాజకీయ నాయకులు కలవడమేమిటని ప్రశ్నించారు. రాజ్ థాకరే తీరు సరికాదన్నారు.

Shaina tweets sympathy for Salman Khan, lands BJP in spot

మరో విషయమేమంటే బీజేపీ నేత షైనా ఎన్సీ.. సల్మాన్ ఖాన్‌కు కలవడం చర్చనీయాంశమైంది. బీజేపీ నేతలు సల్మాన్ ఖాన్‌ను కలుస్తూ వారు విమర్శలు చేయడమేమిటని అంటున్నారు. బీజేపీ మహిళా నేత షైనా ఎన్సీ బాలీవుడ్ హీరోను కలిశారని తెలుస్తోంది.

షైనా ఎన్సీ ఓ ట్వీట్ కూడా చేశారు. సల్మాన్ ఖాన్‌కు మద్దతుగా ఆమె ట్వీట్ చేశారు. ఇది కూడా విమర్శలకు తావిచ్చింది. ఇదిలా ఉండగా, ఖాన్‌ త్రయంలోని అమీర్‌ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌ కూడా సల్మాన్‌ను కలిశారు. ఇతర బాలీవుడ్‌ నటులు వచ్చి వెళ్లారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+