చిరంజీవికి షాక్: యుటిగా హైదరాబాద్ లేనట్లే..

రాజధాని అంశమైతే కొత్త రాష్ట్రానికి ఎన్నికలు జరిగేంతవరకు గుర్తింపుప్రక్రియ ఉండకపోవచ్చునన్న భావాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ అంశాలపై తమకు కేంద్రం నుంచి ఎటువంటి వివరణ ఆదేశాలు రాలేదని కూడా వారంటున్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా నిర్ణయిస్తే పలు అంశాలు సమస్యాత్మకంగా మారుతాయని వారు అంటున్నారు. ప్రధానంగా మున్సిపల్ పరిధిలో ఇల్లు కట్టుకోవాలన్నా, ఉన్న ఇంటి స్థాయి పెంచుకోవాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతే అవసరం ఉంటుందని, ఇది ప్రజలకు ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుందని సీనియర్ అధికారి ఒకరు వెల్లడించినట్లు ఓ తెలుగు దినపత్రిక రాసింది.
కేంద్రపాలిత ప్రాంతంపై పూర్తి స్థాయి అధికారాలు కేంద్రానికే దఖలు పడే పరిస్థితిలో చిన్న నిర్ణయంపై కూడా కేంద్రం నియమించే అధికారి నుంచో, కేంద్రంలోని సంబంధిత శాఖల నుంచో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. ఇదే సమయంలో శాంతిభద్రతల అంశం కూడా కొద్దిగా ఇబ్బంది కలిగించేదిగా ఉంటుందని వారు చెబుతున్నారు. అదే గవర్నర్ చేతికి పగ్గాలు అందిస్తే మాత్రం సమస్యలు కొద్దిగా తగ్గుతాయన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.
కాగా, ఉమ్మడి రాజధాని పరిధిపై కూడా చర్చలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఎంసిహెచ్, జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ పరిధుల్లో దీనిని ఉమ్మడి రాజధానికి ఖరారు చేస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అధికారులు మాత్రం ఎంసిహెచ్ పరిధి లేదా, హైదరాబాద్ జిల్లా పరిధికి మాత్రమే ఉమ్మడి రాజధాని ఖరారు చేసే అవకాశాలు ఉంటాయన్న భావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఒక కొత్త రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా గుర్తించి సచివాలయం, ఇతర శాఖల ఏర్పాటుకు ఎంసిహెచ్ పరిధి సరిపోతుందని వారు చెబుతున్నారు. సీమాంధ్ర ప్రాంత నేతలు మాత్రం విభజన అనివార్యమైతే హెచ్‌ఎండిఎ పరిధిని ఉమ్మడి రాజధానిగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. సీమాంధ్రులు హైదరాబాద్‌లో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారి రక్షణ కోసం హెచ్‌ఎండిఎ అయితే భద్రత సక్రమంగా ఉంటుందని వారంటున్నారు.
ఇలా ఉండగా, కొత్త రాజధాని అంశం కూడా దాదాపుగా ఎన్నికల అనంతరమే నిర్ణయం జరిగే అవకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఒంగోలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కొత్త రాజధాని అంటూ ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇంకా తమకు ఎటువంటి సూచనలు, వివరాలు కోరుతూ ఆదేశాలు రాలేదని అధికారులు అంటున్నారు. విభజన ప్రక్రియ అనంతరం కొత్త రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయని, బిల్లులో రాజధాని అంశం ఉండకపోవచ్చునని వారు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications