Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మధుప్రియకు రివర్స్, భర్త వేడుకోలు: ఏం జరిగింది?

హైదరాబాద్: 'ఆడపిల్లనమ్మా..' అనే పాట ద్వారా గుర్తింపు తెచ్చుకున్న గాయిని మధుప్రియ ప్రేమ పెళ్లి ఆరు నెలల్లోనే కంచికి చేరింది. తల్లిదండ్రులు పెళ్లి వద్దని మొత్తుకున్నా... నాటకీయ పరిణామాల మధ్య మధుప్రియ గత ఏడాది అక్టోబర్ నెలలో శ్రీకాంత్‌‍ను పెళ్లి చేసుకుంది.

శ్రీకాంత్‌ను ఆమె ప్రేమించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని భావించింది. తల్లిదండ్రులు అంగీకరించలేదని చెబుతూ, ఆమె తల్లిదండ్రుల మాటను కాదని పెళ్లి చేసుకుంది. అమ్మానాన్నలను ప్రేమ పెళ్లికి ఒప్పించేందుకు ప్రయత్నం చేశానని, ఫలించక పోవడంతో శ్రీకాంత్‌ను తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లాడానని ఆమె నాడు చెప్పింది.

Also Read: సింగర్ మధుప్రియ: శ్రీకాంత్ ప్రేమలో ఎలా పడిందంటే?

సరిగ్గా ఆరు నెలలు తిరగకముందే ఆమెకు పెళ్లి రివర్స్ అయింది. ఆరు నెలల క్రితం తల్లిదండ్రులను కాదని ఎలాగైతే ధైర్యంగా బయటకు వచ్చి పెళ్లి చేసుకుందో.. ఇప్పుడు అంతే ధైర్యంగా ఆమె బయటకు వచ్చింది. తన భర్త తనను హింసిస్తున్నాడని, తన తల్లిదండ్రుల మాట విననందుకు తనకు ప్రాయశ్చితం జరిగిందని అభిప్రాయపడ్డారు.

నాడు ఎంత నాటకీయ పరిణామాల మధ్య ప్రేమించిన శ్రీకాంత్‌ను మధుప్రియ పెళ్లి చేసుకుందో... ఇప్పుడు భర్త పైన ఫిర్యాదు, శ్రీకాంత్‌కు గాయాలు, మధుప్రియ ప్రాయశ్చితం.. ఇప్పుడు అంతే నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

మధుప్రియ - శ్రీకాంత్

మధుప్రియ - శ్రీకాంత్

మధుప్రియ, శ్రీకాంత్‌ల పెళ్లి గత ఏడాది అక్టోబర్ నెలలో జరిగింది. తల్లిదండ్రులు వద్దని చెప్పినప్పటికీ పెళ్లి చేసుకున్నానని, ఇప్పుడు తనకు తగిన ప్రాయశ్చితం జరిగిందని, తల్లిదండ్రుల మాట ప్రతి యువతి వినాలని మధుప్రియ సూచిస్తున్నారు.

శ్రీకాంత్ పైన దాడి

శ్రీకాంత్ పైన దాడి

శనివారం రాత్రి హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్లో మధుప్రియ భర్త పైన గృహహింస చట్టం కింద ఫిర్యాదు చేసింది. కేసు నమోదయింది. రాత్రంతా హైడ్రామా జరిగింది. ఉదయం శ్రీకాంత్ ఆసుపత్రి పాలయ్యాడు. తన పైన మధుప్రియ బంధువులు దాడి చేశారని ఆరోపిస్తున్నాడు. మధుప్రియ తల్లిదండ్రులు రామంతాపూర్లో ఉంటారు. గాయాలపాలైన శ్రీకాంత్ బంజారాహిల్స్ ఆసుపత్రిలో చేరాడు. రామంతాపూర్లో దాడి జరిగితం ఇంతదూరం వచ్చి ఆసుపత్రిలో ఎందుకు జాయిన్ అయ్యాడనే ప్రశ్న ఉదయిస్తోంది. అదే సమయంలో ఆయన వెంట ఉన్న స్నేహితులు ఎవరో తెలియాల్సి ఉంది.

మధుప్రియ తల్లిదండ్రులే కారణం

మధుప్రియ తల్లిదండ్రులే కారణం

మధుప్రియ మంచిదని, తనకు ఇప్పటికీ ఆమె పైన ప్రేమ ఉందని శ్రీకాంత్ చెబుతున్నాడు. తాను ఎప్పుడు కూడా డబ్బుల కోసం మధుప్రియను వేధించలేదని చెప్పాడు. అంతా మధుప్రియ తల్లిదండ్రులే చేస్తున్నారని చెప్పారు. మధుప్రియ చాలా మంచిదని, ఆమె స్వయంగా తన పైన కేసు పెట్టలేదని, ఆమెతో కేసు పెట్టించారన్నాడు. తనను గతంలో కొట్టించారని, ఇప్పుడు కూడా ఇంటికి పిలిపించి కొట్టారన్నారు. మేం మాత్రం విడిపోమని చెప్పాడు.

చిన్న గొడవే కారణం

చిన్న గొడవే కారణం

తనకు, మధుప్రియకు మధ్య ఎప్పుడు గొడవ జరిగినా.. ఒకరికి కోపం వస్తే మరొకరం కూల్‌గా ఉండేవారమని, నిన్న శనివారం మాత్రం ఇద్దరికీ కోపం వచ్చిందని, ఇదే కారణమన్నాడు. దీనిని ఆసరాగా చేసుకొని మధుప్రియ తల్లిదండ్రులు ఆమెతో కేసు పెట్టించారని చెప్పాడు. చిన్న చిన్న గొడవలు ఎవరికైనా వస్తాయని, మధుప్రియ, తాను ఎప్పటికీ విడిపోమని చెప్పాడు. మధుప్రియ వస్తే బంగారంలా చూసుకుంటానని చెప్పాడు.

మెచ్యూరిటీ ఉంది

మెచ్యూరిటీ ఉంది

శ్రీకాంత్ మామూలుగా అయితే బాగానే ఉంటాడని, కోపం వచ్చినప్పుడు మాత్రం కొడతాడని మధుప్రియ చెబుతోంది. నిన్న తనను కడుపులో తన్నాడని చెప్పింది. తనతో తల్లిదండ్రులు కేసు పెట్టించారనడం విడ్డూరమని చెబుతోంది. తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్నానని, అలాంటి మెచ్యూరిటీ కలిగిన నేను.. తల్లిదండ్రుల మాట విని కేసు పెడతానా అని చెబుతోంది. శ్రీకాంత్‌ను తన వాళ్లు కొట్టలేదని, కొడుతుంటే ఊరుకోవడానికి ఏమైనా చిన్న పిల్లలా అని ప్రశ్నించింది.

భవిష్యత్తు భేష్

భవిష్యత్తు భేష్

తన భవిష్యత్తుకు ఎలాంటి ఇబ్బంది లేదని, నా మాట, నా పాట, నా ఆట నాకు ఉందని మధుప్రియ చెప్పింది. చలాకీతనం తనకు పుట్టుకతో వచ్చిందని, అలాగే ఉంటానని చెప్పింది. తనకు మెచ్యూరిటీ ఉంది కాబట్టే శ్రీకాంత్ ప్రవర్తను ఆరు నెలలుగా ఓపిక పట్టానని, సర్దుకుపోయానని, ఆరు నెలలు తానే కుటుంబాన్ని పోషించానని చెప్పింది. మధుప్రియ తల్లిదండ్రులు మాట్లాడుతూ... ఇలా జరుగుతుందని మేం ముందే ఊహించామని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాంత్ గురించి తాము ముందే ఆరా తీశామన్నారు. మధుప్రియ మాతో మాట్లాడవద్దని, ఆమె డబ్బు కావాలని... ఇది శ్రీకాంత్ గుణం అన్నారు. మధుప్రియ డబ్బుతో ఎంజాయ్ చేయాలి, మట్కా ఆడాలి, తాగాలి.. ఇది అతని తీరు అని ఆరోపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+