బీహార్ ఎన్నికల్లో సోనియా వ్యూహం: ఎపికి హోదాపై పోరు

న్యూఢిల్లీ: బీహార్ ఎన్నికల్లో బిజెపిని ఇరకాటంలో పెట్టేందుకే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా హామీపై కాంగ్రెసు అధ్యక్షురాలు వ్యూహాత్మకంగా పోరాటం ప్రారంభించినట్లు భావిస్తున్నారు. బీహార్ ఎన్నికల సమయంలో ఎపికి ప్రత్యేక హోదాపై కేంద్రంపై ఒత్తిడి తేవడం సరి కాదని బిజెపి భావిస్తోంది. అయితే, బిజెపిని చిక్కుల్లో పడేయడానికి ఇదే సరైన సమయమని సోనియా భావిస్తున్నట్లు చెబుతున్నారు.

బీహార్‌ ఎన్నికల వేళ ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. బీహార్‌కు కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వడానికి సిద్ధంగా లేదు. దీంతో ప్రత్యేక హోదాపై ఏపీతోపాటు బీహార్‌ కూడా డిమాండ్ చేస్తోంది. ప్రత్యేక హోదా ఇస్తే బీహార్‌ అభివృద్ధి చెందుతుందని, పరిశ్రమలు వస్తాయని, హోదా ఇవ్వకపోతే ఎన్డీయే బీహార్‌కు అన్యాయం చేసినట్లేనని ఆ రాష్ట్ర సీఎం నితీశ్‌కుమార్‌ మండిపడుతున్నారు.

18న ప్రధాని మోడీ బీహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించనున్నారంటూ వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో నితీష్ కుమార్ హోదా కోసం పట్టుపడుతున్నారు. నిజానికి యూపీఏ ప్రభుత్వమే బీహార్‌కు హోదా ఇవ్వడానికి అంగీకరించింది. అయితే ఆ తర్వాత రూ.10వేల కోట్ల ప్యాకేజీతో సరిపెట్టింది. ఎన్నికల వేళ ఎన్డీయే సర్కార్‌ హోదా ఇవ్వడం ఖాయమని నితీశ్‌ సర్కార్‌ భావిస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థికసంఘం ఎక్కడా చెప్పలేదని, హోదా అంశం పూర్తిగా కేంద్రం పరిధిలోనిదేనని నితీశ్‌ అంటున్నారు.

Sonia Gandhi strategy on special status to AP

ఆదివారం పాట్నాలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బీహార్‌ ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెబుతారని నితీష్ కుమార్ అన్నారు అయితే, ప్రధాని మోడీ ప్రకటించే రూ.50వేల కోట్ల ప్యాకేజీని నీరుగార్చేందుకే నితీశ్‌ ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారని బీజేపీ నేతలు ప్రతి విమర్శలకు దిగుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తే బీహార్‌లో బిజెపికి ఎదురు దెబ్బ తగిలే ప్రమాదం ఉంది. అలా చేయడానికే కాంగ్రెసు పార్టీ ఎపికి ప్రత్యేక హోదాను ముందుకు తెచ్చి ఒత్తిడి పెంచుతుందనే అభిప్రాయం ఉంది. కేంద్రంపై ఒత్తిడి పెంచేలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కూడా అటువైపుగా నెడుతోంది.

కాగా, ఈ నెల 20వ తేదీన చంద్రబాబు ప్రధాని మోడీని కలిసే అవకాశం ఉంది. ప్రత్యేక హోదాపై, ప్రత్యేక ప్యాకేజీపై ఈ సమావేశంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. అయితే, ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసినట్లుగానే భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+