సర్వే: కెసిఆర్ నెంబర్ వన్, బాబు దిగదుడుపే...

హైదరాబాద్: ముఖ్యమంత్రుల పనితీరులో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రథమ స్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రుల పనితీరుపై విడిపి అసోసియేట్స్ నిర్వహించిన సర్వేలో ముఖ్యమంత్రి ఆయన మొదటి స్థానంలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎనిమిదవ స్థానంలో నిలిచారు.

నిరుడు విడిపిఎ సంస్థ నిర్వహించిన సర్వేలోనూ కెసిఆర్ మొదటి స్థానంలో నిలిచారు. 87 శాతం ఓటర్లు మోస్ట్ పాపులర్ సిఎంగా కెసిఆర్‌కు ఓటు వేశారు. 87శాతంతో ముఖ్యమంత్రి కెసిఆర్ మొదటి స్థానంలోనిలువగా 85 శాతంతో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రెండవ స్థానంలో పొందారు.

KCR - CBN

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 79 శాతం ఓట్లతో మూడవ స్థానంలో, జయలలిత 75 శాతం ఓట్లతో నాలుగవ స్థానంలో, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ 62శాతం ఓట్లతో ఐదవ స్థానంలో నిలిచారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ 61శాతం ఓట్లతో ఆరవ స్థానంలో, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే 58 శాతం ఓట్లతో ఏడవ స్థానంలో నిలిచారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 58 శాతంతో ఎనిమిదవ స్థానంలో, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ రుపాణి 52శాతం ఓట్లతో తొమ్మిదవ స్థానంలో నిలిచారు. కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య 49 శాతం ఓట్లతో పదవ స్థానంలో, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ 43శాతం
ఓట్లతో 11వ స్థానంలో నిలిచారు.

ఆంధ్రలో కన్నా తెలంగాణలోనే మోడీకి మద్దతు

ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయా రాష్ట్రాల్లో ఉన్న లభించిన ఆమోదం ఏ విధంగా ఉందనే దానిపై సర్వేను కూడా నిర్వహించారు. బిజెపి మిత్రపక్షమైన ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలోనే మోడీకి ఎక్కువ మద్దతు లభించింది.

ఆంధ్రప్రదేశ్ (43)తెలంగాణ (55)తమిళనాడు (58)కర్నాటక (70)ఒడిస్సా(65) పశ్చిమ బెంగాల్( 58)బీహార్(78) ఉత్తరప్రదేశ్ (75)మధ్యప్రదేశ్(81)గుజరాత్(68)రాజస్థాన్‌లో 71శాతం మంది మోదీ పనితీరుకు ఓటేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+