మరో ఘనత: గూగుల్ స్ట్రీట్ వ్యూలో ‘తాజ్’ టాప్
న్యూఢిల్లీ: ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ మరో ఘన కీర్తిని సొంతం చేసుకుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్త పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్న తాజ్ మహల్.. ఆసియా ఖండంలో అత్యధిక పర్యాటకులను ఆకర్షించే కట్టడాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.
గూగుల్ స్ట్రీట్ వ్యూ డెస్టినేషన్‌లో ఈ విషయం తేలింది. గూగుల్ స్ట్రీట్ వ్యూ డెస్టినేషన్‌లో అత్యధిక మంది పర్యాటకులు తాజ్ మహల్ కోసమే వెతికారు. ఈ మేరకు ఆసియాలోని ఇతర దేశాల్లోని కట్టడాలతో పోలిస్తే తాజ్ మహల్‌ను చూడటానికే ప్రపంచ పర్యాటకులు ఆసక్తి కనబర్చారని గూగుల్ ప్రకటించింది.

తాజ్ మహల్ తోపాటు దేశంలోని ఎర్రకోట, కుతుబ్ మినార్, జంతర్ మంతర్, ఆగ్రా కోట, లావాసా, ఐఐటి బాంబే తదితరాలను కూడా చూసేందుకు ప్రపంచ పర్యాటకులు ఆసక్తి చూపారని గూగుల్ వెల్లడించింది. తాజ్ మహల్‌ను చూసేందుకు సింగపూర్, ఆస్ట్రేలియా, కొరియా, ఫిలిప్పైన్స్, మలేషియా లాంటి దేశాల ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని తెలిపింది.
కాగా, గత సంవత్సరం జపాన్ ఫ్యూజీ పర్వత ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు ఇష్టపడ్డారు. ఇప్పటికీ కూడా ఆ దేశంలోని సాంప్రదాయ కట్టడాలు, ఆలయాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications