1 నేకొక్కడినే: కలెక్షన్ల వేటలో తండ్రి కొడుకులు!
హైదరాబాద్: ‘1 నేనొక్కడినే' చిత్రం ఈ రోజు గ్రాండ్‌గా విడుదలైంది. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన మహేష్ బాబు నటించిన సినిమా కావడంతో ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే హాట్ హాట్ టాక్ నడుస్తోంది. తెలుగు సినిమా కలెక్షన్ల రికార్డులను తిరగరాయాలనే కసితో ఉన్న మహేష్ బాబు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వేటకు సింగిల్‌గా రాకుండా....తన కొడుకు గౌతం కృష్ణను వెంటబెట్టుకొచ్చాడు.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘1 నేనొక్కడినే' చిత్రం కోసం దాదాపు రూ. 60 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసారు. అయితే విడుదలకు ముందే ఈచిత్రం థియేట్రికల్ రైట్స్, ఇతర రైట్స్ రూపంలో దాదాపు 80 కోట్ల వరకు వసూలు చేసిందని అంచనా. సంక్రాంతి పండగ సీజన్ కాబట్టి బాక్సాఫీసు వద్ద సక్సెస్ టాక్ వస్తే రూ. 100 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు.

అదే జరిగితే తెలుగు సినిమా చరిత్రలో 100 కోట్లు వసూలు చేసిన తొలి హీరోగా మహేష్ బాబు రికార్డుల కెక్కుతాడు. అయితే ఈ రోజు సినిమా విడుదలైన తర్వాత వినిపిస్తున్న టాక్ పరిశీలిస్తే........100 కోట్ల మార్కును అందుకుంటుందా? అనే అంశంపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ సినిమాకు 100 కోట్లు సాధించే సత్తా ఉందా? లేదా? అనేది ఓ వారం గడిస్తే గానీ స్పష్టంగా చెప్పలేం.
ఇక సినిమా వివరాల్లోకి వెళితే..... సకుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో క్రితి సానన్ హీరోయిన్‌గా నటించింది. మహేష్ తనయుడు గౌతం కృష్ణ ఈ చిత్రంతో బాల నటుడిగా తెరంగ్రేటం చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకరలు ఈచిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ అనే బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ కూడా ఈచిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంది.












Click it and Unblock the Notifications