బాబు వద్దకి క్యూ: గంటా, ఎర్రబెల్లి నవ్వారు(పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద గెలుపొందిన నేతలు, కార్యకర్తలతో సందడి నెలకొంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టిడిపి నేతలు చంద్రబాబుకు అభినందనలు తెలిపేందుకు భారీగా తరలి వచ్చారు. నాయకులు పరస్పరం అభినందనలు తెలుపుకుంటూ ఉండటంతో ఆ ప్రాంతమంతా విజయోత్సవ సందడి నెలకొంది.
నర్సరావుపేట, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి ఎంపీలుగా గెలుపొందిన రాయపాటి సాంబశివ రావు, గల్లా జయదేవ్, మాగంటి బాబు, మురళీ మోహన్ తదితరులు బాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థులుగా విజయం సాధించిన ధూళిపాళ్ల నరేంద్ర, గంటా శ్రీనివాసరావు, గొల్లపల్లి సూర్యా రావు, తోట సీతామహాలక్ష్మి, ఉభయగోదావరి జిల్లాల టిడిపి నేతలు, సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తదితరులు బాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, ఏరాసు ప్రతా పరెడ్డి, అంబికా కృష్ణ తదితరులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి బాబును అభినందించారు. కాగా హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా చంద్రబాబును కలిశారు.

పితాని సత్యనారాయణ
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పితాని సత్యనారాయణ ఆదివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు.

మురళీ మోహన్
ప్రముఖ సినీ నటుడు, రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ ఆదివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు.

మురళీ మోహన్
ప్రముఖ సినీ నటుడు, రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ ఆదివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

గాలి
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆదివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు.

యనమల
మాజీ మంత్రి, శాసన మండలి టిడిపి పక్షనేత యనమల రామకృష్ణుడు ఆదివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు.

గంటా
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గంటా శ్రీనివాస రావు ఆదివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. గంటాతో ఎర్రబెల్లి.

ఎర్రబెల్లి
తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు తదితరులు ఆదివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు.

ఎర్రబెల్లి, గంటా
ఆదివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిసిన అనంతరం తెలంగాణ టిడిపి నేత ఎర్రబెల్లితో, సీమాంధ్ర టిడిపి నేత గంటా.

దూళిపాళ్ల
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర ఆదివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు.

టిడిపి నేతలు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద గెలుపొందిన నేతలు, కార్యకర్తలతో సందడి నెలకొంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టిడిపి నేతలు చంద్రబాబుకు అభినందనలు తెలిపేందుకు భారీగా తరలి వచ్చారు.

మురళీ మోహన్
ప్రముఖ సినీ నటుడు, రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ ఆదివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిసిన అనంతరం వెళ్తున్న దృశ్యం.

మురళీ మోహన్
ప్రముఖ సినీ నటుడు, రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ ఆదివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

మురళీ మోహన్
ప్రముఖ సినీ నటుడు, రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ ఆదివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. అనంతరం నాయకులతో కరచాలనం

యనమల రామకృష్ణుడు
మాజీ మంత్రి, శాసన మండలి టిడిపి పక్షనేత యనమల రామకృష్ణుడు ఆదివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిసిన అనంతరం కారులో వెళ్తున్న దృశ్యం.

రమణ
తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎల్ రమణ ఆదివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిసిన అనంతరం కారులో వెళ్తున్న దృశ్యం.

గంటా
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గంటా శ్రీనివాస రావు ఆదివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

గంటా, ఎర్రబెల్లి
ఆదివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిసిన అనంతరం తెలంగాణ టిడిపి నేత ఎర్రబెల్లి, సీమాంధ్ర టిడిపి నేత గంటా శ్రీనివాస రావు విలేకరులతో నవ్వుతూ...

ఎర్రబెల్లి, రమణ
ఆదివారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిసిన అనంతరం తెలంగాణ టిడిపి నేతలు ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర రావుల మాటా మంతి.

రాయపాటి
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు శాలువా కప్పి అభినందిస్తున్న నర్సారావుపేట ఎంపీ రాయపాటి సాంబశివ రావు.

ప్రసాదం
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో శ్రీవారిని దర్శించుకున్నారు. టిటిడి అధికారులు ప్రసాదం ఇస్తున్న దృశ్యం.












Click it and Unblock the Notifications