తెలంగాణ: అసెంబ్లీని సమావేశపరచాలంటే...?

Telangana: At least five days needed to convene Assembly session
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు వస్తే రాష్ట్ర శాసనసభను సమావేశపరచడానికి కనీసం ఐదు రోజుల సమయం కావాల్సి వస్తుందని అంటున్నారు. డిసెంబర్ 4వ తేదీన కేంద్ర మంత్రి వర్గం తెలంగాణ ముసాయిదా బిల్లును ఆమోదించి, రాష్ట్రపతికి పంపిన తర్వాత అది శాసనసభకు వస్తుంది. అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి రాష్ట్రపతి తెలంగాణ ముసాయిదా బిల్లును శాసనసభకు పంపిస్తారు. అలా పంపించిన తర్వాత ప్రత్యేకంగా అసెంబ్లీని సమావేశపరచాల్సి వస్తుంది.

అలా చూస్తే తెలంగాణ బిల్లు డిసెంబర్ 6 తర్వాతనే శాసనసభకు వచ్చే అవకాశాలున్నాయి. ఇంకా ఆలస్యం కూడా కావచ్చు. బిల్లు గవర్నర్ ద్వారా శాసనసభకు వస్తుంది. అప్పుడు గవర్నర్ శాసనసభను సమావేశపరచాలని ముఖ్యమంత్రికి నోట్ పెట్టాలని స్పీకర్‌కు సూచిస్తారు. అసాధారణమైన పరిస్థితిలో గవర్నర్ ముఖ్యమంత్రిని, స్పీకర్‌ను ఆహ్వానించి సంప్రదింపులు జరిపి శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకోవచ్చు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే, శాసనసభ ప్రోరోగ్ కాలేదు. అయినా శాసనసభను సమావేశపరచడానికి కనీసం రెండు రోజుల వ్యవధి అవసరమవుతుంది. సభ్యులకు వ్యక్తిగతంగా సమాచారం అందించడానికి ఆ మాత్రం సమయం కావాల్సి వస్తుంది.

అందువల్ల ఒక్క రోజు సమాచారంతో శాసనసభను సమావేశపరచడం సాధ్యం కాదు. భద్రతా ఏర్పాట్ల వంటివి చేస్తే తప్ప వెంటనే శాసనసభను ఏర్పాటు చేయడం సాధ్యం కాదు. ఈ స్థితిలో భద్రతా ఏర్పాట్ల వంటివాటిని ఇప్పటికే స్పీకర్ నాదెండ్ల మనోహర్ పర్యవేక్షిస్తున్నారు. అయితే, కాలపరిమితి దృష్ట్యా డిసెంబర్‌లో శాసనసభ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.

కాగా, డిసెంబర్ 4వ తేదీ తెలంగాణ ముసాయిదా బిల్లును కేంద్ర మంత్రి వర్గం ఆమోదించి, రాష్ట్రపతికి పంపితే శాసనసభకు రావడానికి కనీసం వారం రోజులైనా పట్టవచ్చునని అంటున్నారు. అంటే, డిసెంబర్ 10, 15 తేదీల మధ్య తెలంగాణ ముసాయిదా బిల్లు శాసనసభకు వచ్చే అవకాశం ఉంది. పార్లమెంటు సమావేశాలు డిసెంబర్ 20తో ముగుస్తున్నాయి. మరోవైపు, పార్లమెంటు శీతాకాలం సమావేశాల్లోనే బిల్లును ప్రతిపాదిస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అంటున్నారు. ఇదెలా సాధ్యమవుతుందనేది అంతు పట్టకుండా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+