4 కోట్ల బూతు వైబ్‌సైట్లు: తెలంగాణ సిఐడి కొరడా
న్యూఢిల్లీ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా బూతు వైబ్‌సైట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. అశ్లీల వెబ్‌సైట్లను కట్టడి చేయాల్సిన అవసరాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం గుర్తించి, అందుకు తగిన చర్యలకు ఉపక్రమించింది. అశ్లీల వెబ్‌సైట్లు దేశంలో దాదాపు 4 కోట్ల దాకా ఉంటాయని కంప్యూటర్స్ ఎమర్జెన్సీ టీమ్ అంచనా వేసింది. అశ్లీల వైబ్‌సైట్ల కట్టడి చేసి, నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ప్రధాని ఆదేశించారు. దీనికి సంబంధించి అశ్లీల వెబ్‌సైట్స్ జాబితాను తయారు చేయాల్సిందిగా ఆయన కోరారు.
భారతీయ సంస్కృతికి ఇవి విరుద్ధం కాబట్టి వాటిని నిరోధించాలన్న నిర్ణయం తీసుకుంటున్నట్లు ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. కాగా, అశ్లీల వెబ్‌సైట్ల వల్ల అత్యాచారాలు, మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయని, కాబట్టి వీటిని నిరోధించాలనిన్యాయవాది కమలేశ్ వాస్వానీ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది.

సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతున్న అశ్లీల వెబ్‌సైట్లపై తెలంగాణ రాష్ట్ర సీఐడీ అధికారులు కొరడా ఝళిపించేందుకు సిద్ధమయ్యారు. ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు చేయని పనిని చేసేందుకు తెలంగాణలోని సీఐడీ అధికారులు ముందుకు వస్తున్నారు. అశ్లీల సైట్లను కట్టడి చేయాల్సిందిగా పలుమార్లు కేంద్రాన్ని కోరినా ఫలితం లేకపోవడంతో చట్టపరంగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బూతుసైట్లను మూసేందుకు చర్యలు చేపట్టారు. 1400 అశ్లీల వెబ్‌సైట్లపై కేసులు నమోదు చేసిన అధికారులు వీటిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అశ్లీల వెబ్‌సైట్ల వల్ల తలెత్తుతున్న పరిణామాలను పిటిషన్‌లో వివరించారు. చిన్నారులు, యువతులు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాల్లో ఎక్కువమటుకు అవే కారణమనే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. ఒక్కో వెబ్‌సైట్‌కు అనుబంధ లింకులు ఉంటాయని ఇలా వేల సంఖ్యలో అశ్లీల సైట్ల లింకులు చిన్నపిల్లలు, యువతను పెడదారి పట్టిస్తున్న విషయాన్ని కోర్టుకు నివేదించారు. కోర్టు ఇచ్చే తదుపరి ఆదేశాల ప్రకారం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అశ్లీల సైట్లను నిలువరించాలని తెలంగాణ సీఐడీ అధికారులు భావిస్తున్నారు.
అశ్లీల వెబ్‌సైట్ల నుంచి యువత తమ సెల్‌ఫోన్లలో నీలి చిత్రాలను ఎక్కువగా డౌన్‌లౌడ్ చేస్తున్నట్లు తెలంగాణ సిఐడి అధికారులు గుర్తించారు. ఫలితంగా మైనర్లు సైతం నేరాలకు పాల్పడుతున్నారని భావించిన తెలంగాణ సీఐడీ అధికారులు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. పోర్న్ సైట్లను నిషేధించాలని శుక్రవారం నాడు కోర్టులో పిటీషన్ దాఖలుచేశరు. ఈ అంశంపై కేంద్రానికి, ముబైల్ ఆపరేటర్లకు ఆదేశాలను జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, మొబైల్ ఫోన్లలో పోర్న్ సైట్లు ఓపెన్ కాకుండా చేయడంపై అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications