టి ఆటంబాంబు 'రచ్చ'!: కిరణ్ స్థానంలో దామోదర

Telanganites targetting Kiran
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరిస్తూ విభజనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న కిరణ్ ఫోటోను రచ్చబండ కార్యక్రమంలో పెట్టకుండా తెలంగాణవాదులు అడ్డుకుంటున్నారు. రెండు రోజులుగా సీమాంధ్రలో నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమంలో కిరణ్ సమైక్యాంధ్రకు అనుకూలంగా బలమైన స్వరం వినిపిస్తున్నారు.

విభజనతో తెలంగాణకే ఎక్కువ నష్టమని, సమైక్యం కోసం పదవి పోయినా పరవాలేదని శుక్రవారం చెప్పిన కిరణ్.. విభజన ఆటంబాంబును ఆపేస్తానని, ఐక్యత కోసం ఏ త్యాగానికైనా సిద్ధమని శనివారం చెప్పారు. ఆయన వ్యాఖ్యల మీద కాంగ్రెస్ సహా వివిధ పార్టీల నేతలు భగ్గుమన్నారు.

శనివారం తెలంగాణ జిల్లాల్లో జరిగిన రచ్చబండ కార్యక్రమాల్లో కిరణ్ బొమ్మ ఉన్న ఫ్లెక్సీలను చించివేసి తగులబెట్టారు. కిరణ్ టెర్రరిస్టు కన్నా ప్రమాదమని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. నల్లగొండలో రచ్చబండ రసాభాసగా మారింది. ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్న ఈ రచ్చబండలో వేదికపై ముఖ్యమంత్రి కిరణ్ చిత్రంతో ఫ్లెక్సీని ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు దానిని చించి వేశారు.

పోలీసులు వారిని అరెస్టు చేయడానికి యత్నించగా కోమటిరెడ్డి వారించారు. ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ పాల్గొన్న ఆలేరు రచ్చబండలో ముఖ్యమంత్రి ఫ్లెక్సీ ఏర్పాటుపై తెరాస కార్యకర్తలు నిరసన తెలిపారు. ఆదిలాబాద్‌లో తెరాస నిరసనతో ఎమ్మెల్యే జోగు రామన్న సిఎం ఫొటో తొలగించి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఫొటోను ఏర్పాటు చేశారు. రెబ్బెనలో ఎమ్మెల్యే సక్కు సిఎం ఫ్లెక్సీని తొలగించాల్సిలని ఆదేశించారు. బెజ్జూరులో ఫ్లెక్సీని చింపి వేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కరీంనగర్ జిల్లాలో పలు ఐకాసల ఆధ్వర్యంలో చవఎం దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+