ప్రధాని మోదీకి ఇండోనేసియా అత్యున్నత పౌర పురస్కారం

ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇండోనేషియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన 'బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా'ను ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ప్రదానం చేశారు. ది బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా పురస్కారం పౌరులకు అలాగే సైనికులకు అందించే అత్యున్నత పౌర పురస్కారంగా చెబుతారు. దేశం, ప్రజల కోసం సేవ చేసిన వారికి గౌరవంగా ఈ అవార్డును 1959 నుంచి అందిస్తున్నారు.

మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ ఇండోనేషియా చేరుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో ఆ దేశంలో పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఇండోనేషియాలో బ్రహ్మోస్ క్షిపణి అభివృద్ధికి భారత్ సాయం అందించనుంది. అలాగే భారత్ నుంచి అస్త్రా మిసైల్స్ ను దిగుమతి చేసుకోవాలని ఇండోనేషియా నిర్ణయించింది. అలాగే ఇండోనేషియాలో ఈవీఎంల అభివృద్ధికి భారత్ సాయపడనుంది.

PMModi Honoured with Indonesia s Prestigious Highest Civilian Award Indonesia award PM NarendraModi

ఇక మలక్కా జలసంధి పరిధిలో ఉన్న సబాంగ్ పోర్టును సంయుక్తంగా అభివృద్ధి చేయాలని భారత్- ఇండోనేషియా నిర్ణయం తీసుకున్నాయి. అలాగే ఇండోనేషియాలో ఐరన్, నికెల్, మాగ్నెటిక్ తయారీలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ప్రధాని మోదీ జూలై 6 నుంచి జూలై 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన భారత్ యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఇండియన్ ఓషియన్ భద్రతకు సంబంధించి మహాసాగర్ విజన్ ను మరింత బలోపేతం చేయడానికి ఉపయోగ పడుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+