ఆ మూవీ సమయంలో నా అండాలు దాచుకున్నా: 'ప్రభాస్' హీరోయిన్ కామెంట్స్ వైరల్
బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ తెలుగులోనూ పలు సినిమాల్లో నటించింది. కానీ ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాలో సీత పాత్రతో అందరికీ గుర్తుండిపోయింది. అంతకుముందు సూపర్ స్టార్ మహేశ్ బాబుతో 1 నేనొక్కడినే(2014), దోచేయ్(2015) సినిమాల్లో నటించింది. ఇక బాలీవుడ్ లో అనేక హిట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే తాజాగా కృతి సనన్ ఓ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. పెళ్లి, పిల్లల విషయంలో సొసైటీ నుంచి వచ్చే ఒత్తిడిని ఎదుర్కొనేందుకు తాను కొన్ని సంవత్సరాల క్రితమే అండాలను ఫ్రీజ్ చేయించుకున్నట్లు పేర్కొంది. ఇలా చేయడం ద్వారా తన కెరీర్, టైమ్ లైన్ పై ఎలాంటి ప్రభావం ఉండదు అని తెలిపింది.
మిమి మూవీ షూటింగ్ సమయంలో ఆ పాత్రకు తగినట్లుగా బరువు పెరగాల్సి వచ్చింది. బరువు పెరగడం కారణంగా అండాశయంపై ప్రభావం చూపిస్తుంది. దాంతో ఫ్యూచర్ లో గర్భం దాల్చాల్సి వచ్చినప్పుడు సమస్యలు ఎదురవుతుంటాయి. అందువల్ల ఇటీవలికాలంలో చాలామంది ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతిని అనుసరిస్తుంటారని కృతి సనన్ పేర్కొంది. 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' వ్యవస్థాపకురాలు కరిష్మా మెహతాతో జరిగిన పాడ్ కాస్ట్ లో తొలిసారిగా కృతి సనన్ ఈ విషయాలను వెల్లడించింది.

ఇక కృతి సనన్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం మిమి. సరోగసీ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. మిమి(కృతి సనన్) తన హీరోయిన్ కలను నెరవేర్చుకోవాలంటే భారీగా డబ్బు కావాల్సి వస్తుంది. అయితే అదే సమయంలో ఓ అమెరికన్ జంట తమకు పిల్లలు పుట్టరని తెలిసి సరోగసీ కోసం ఇండియాకు వస్తారు. ఈ క్రమంలో వాళ్లకు అద్దె గర్భం ఇచ్చేందుకు మిమి అంగీకరిస్తుంది. అలా మిమి గర్భం దాల్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ అమెరికన్ జంట బిడ్డను వద్దని తమ దేశానికి వెళ్లిపోతుంది.. ఆ తర్వాత ఏం జరిగింది..? అనేది స్టోరీ..












Click it and Unblock the Notifications