పవన్ కళ్యాణ్ స్టోరీ: గ్లామర్ కోసం టిడిపి తహతహ

Telugu Desam wants cine glamour
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీలో చేరుతారంటూ పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వరుస పెట్టి ఆహ్వానం పలికారు. దీన్నిబట్టి సినీ గ్లామర్ కోసం తెలుగుదేశం పార్టీ ఎంతగా తహతహలాడుతోందో అర్థమవుతోంది. అధికారంలో ఉన్నంత వరకూ తెలుగుదేశం పార్టీలో సినిమా గ్లామర్ కళకళలాడింది. ఎన్టీఆర్ భవనో, సినిమా స్టూడియోనో తెలియనంతగా సినిమా గ్లామర్ అక్కడ కనిపించేది.

అధికారం చేజారిన తొమ్మిదేళ్లలో పరిస్థితి పూర్తిగా మారింది. ఈ తరానికి ఏమాత్రం తెలియని సీనియర్ నటీమణులు గీతాంజలి, కవిత, మురళీ మోహన్ వంటివారు మాత్రమే ఇప్పుడు టిడిపికి ఉన్న సినిమా గ్లామర్. అధికారం పోయిన తరువాత కూడా కొంతకాలం రోజా పార్టీలో ఒక వెలుగు వెలిగినా, 2009 ఓటమి తరువాత ఆమె కాంగ్రెస్‌కు, తరువాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మారిపోయారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మిగిలింది బాలకృష్ణ, మురళీమోహన్. జూనియర్ ఎన్టీఆర్ లేకపోవడం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.

ప్రముఖ నటి రోజా సైతం పార్టీ వీడి వెళ్లిన తరువాత సినిమా గ్లామర్ కోసం తెలుగుదేశం పార్టీ ఎదురు చూడక తప్పటం లేదు. జయప్రద టిడిపిలో చేరనున్నట్టు పార్టీ నేతలు ప్రచారం చేశారు. ఆమె మాత్రం కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలకు మధ్య ఊగిసలాడుతూ సోనియాగాంధీని కలిశారు. ఆమె కాంగ్రెసు పార్టీలో చేరడం ఖాయమైనట్లే భావిస్తున్నారు.

అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్‌కు సన్నిహితుడైన ఎమ్మెల్యే కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరడంతో జూనియర్ ఎన్టీఆరే అతడిని పంపించాడని, ఆయన కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మద్దతు ఇస్తారని ప్రచారం సాగింది. ఈ ప్రచారం ప్రారంభమైన కొద్దిరోజుల తరువాత పవన్ కళ్యాణ్ టిడిపిలో చేరుతాడని పార్టీ అభిమానులు ప్రచారం చేశారు. ఇంటర్‌నెట్, ఫేస్‌బుక్‌లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా మళ్లీ ఈ ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. మార్ఫింగ్ కళతో పవన్ కళ్యాణ్ మెడలో టిడిపి కండువా వేసి ప్రచారం చేసుకోవాల్సి వస్తుంది. ఫేస్‌బుక్ నుంచి ఈ ప్రచారం ఎలక్ట్రానిక్ మీడియాలోకి చేరింది. ఏమైనా, పవన్ కళ్యాణ్ ఉదంతం తెలుగుదేశం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లే కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+