ఐసిస్ షాకింగ్: భారతీయ యువతుల కీ రోల్

హైదరాబాద్/న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదంలో ఎన్నో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఐసిస్ ఉగ్రవాదం వైపు యువతను మళ్లించేందుకు ఆ ఉగ్రవాద సంస్థకు చెందిన పలువురు యువతులు ప్రయత్నిస్తున్నారు. అందులో భారతీయ యువతులు కూడా ఉన్నారంటున్నారు.

ఐసిస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది యువతను తమ వైపుకు ఆకర్షింప చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. గత కొద్ది నెలలుగా... ఎక్కువగా యువతులు ఐసిస్ వైపు యువతను ఆకర్షింప చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. భారతీయ యువతులూ ఉన్నారు.

ఐసిస్ వైపు ఆకర్షితులైన యువతులు కొందరు సిరియా లేదా ఇరాక్ వెళ్తున్నారు. మరికొందరు విదేశాలకు వెళ్తున్నారు. విదేశాల్లో యువతను ఐసిస్ వైపు మళ్లించే ప్రయత్నం కోసం వెళ్తున్నారు.

భారత్ నుంచి దాదాపు తొమ్మిది మంది యువతులు ఐసిస్‌లో చేరడం లేదా చేరేందుకు ప్రయత్నాలు చేయడం జరిగింది. హైదరాబాద్ నుంచి యువతులు.. తమ సోదరులు, స్నేహితులతో కలిసి వెళ్లే ప్రయత్నాలు చేశారు.

The Indian women recruits of the ISIS play a variety of roles

ఐసిస్‌లో చేరేందుకు పలువురు యువతులు హైదరాబాద్ నుంచి వెళ్లారు. అయితే, ఇంటెలిజెన్స్ అధికారుల అప్రమత్తతో పోలీసులు వారిని తిరిగి వెనక్కి రప్పించారు. వారి పైన పోలీసులు ఓ కన్ను వేసి ఉంచారు.

2014 డిసెంబర్ నెలలో పోలీసులు ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఐసిస్ ఉగ్రవాదం వైపు ఆకర్షితురాలయ్యారు. కేరళలోని ఓ స్నేహితుడి ద్వారా ఆమె ఐసిస్ వైపు ఆకర్షితురాలయ్యారు. ఐసిస్ నుంచి తిరిగి వచ్చింది. అంతకుముందు అక్కడ రెండు నెలల పాటు సిరియాలో గడిపింది.

మరో కేసులో, లండన్‌లో ఉంటున్న భారతీయురాలు ఆయేషా బేగం... హైదరాబాదుకు చెందిన అప్షా జబీన్ అలియాస్ నిక్కీ జోసెప్ పాత్రను పోషించింది. వీరు సోషల్ మీడియా ద్వారా యువతను ఐసిస్ వైపు ఆకర్షించే ప్రయత్నాలు చేశారు.

భారత్ నుంచి తొమ్మిది మంది యువతులు ఐసిస్ వైపు ఆకర్షితులయ్యారు. ఇదిలా ఉండగా, వివిధ దేశాల నుంచి వెళ్లే యువతులను ఇరాక్ లేదా సిరియా ఐసిస్ ఉగ్రవాదులు ఫైటర్స్ కోసం సెక్స్ బానిసలుగా ఉంచుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+