హ్యాపీగా వచ్చిన కవితకు కోపం తెప్పించిన రేవంత్

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తన పైన చేసిన ఆరోపణల పైన నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత శుక్రవారం తీవ్రంగా స్పందించారు. సమగ్ర సర్వే సమయంలో కవిత రెండుచోట్ల తన వివరాలు ఇచ్చారని రేవంత్ చెప్పారు. ఈ ఆరోపణలను తెరాస కొట్టివేసింది. అయితే, తాను పత్రికలో వచ్చిన ఆధారాలు చూపించేందుకు సిద్ధమని రేవంత్ చెప్పారు.

ఈ అంశంపై కవిత ఈ రోజు స్పందించారు. ఆమె ఇంగ్లాండ్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఆరోపణల పైన స్పందించారు.

తనపై లేనిపోని అభాండాలు మోపవద్దని హితవు పలికారు. సమగ్ర సర్వే సందర్భంగా తాను రెండుచోట్ల పేరు నమోదు చేయించుకున్నానన్న ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నవారైన ఈ తరహా ఆరోపణలు చేయరన్నారు.

నిజామాబాద్ ప్రజలు తనను గెలిపించడం వల్లే ఇంగ్లాండ్ వరకు వెళ్లగలిగానని చెప్పారు. నిజామాబాద్ ఓటర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అక్కడి సదస్సులో తెలుసుకున్న అంశాల ఆధారంగా తెలంగాణ అభివృద్ధి కోసం ప్రయత్నిస్తానని చెప్పారు.సమగ్ర సర్వేలో ఒక చోటే పేరును నమోదు చేసుకున్నట్లు స్పష్టం చేశారు. ఎవరైనా ఒకే చోటే సర్వేలో వివరాలు నమోదు చేసుకుంటారని చెప్పారు.

They have no common sense: Kavitha on Revanth Reddy allegations

సీఎం కేసీఆర్‌ సర్వే ఏ ఉద్దేశంతో చేపట్టారో అందరికీ తెలుసన్నారు. నిజనిజాలు త్వరలోనే బయటకు వస్తాయన్నారు. కాగా, అభివృద్ధి పైన 15 రోజుల పాటు ఇంగ్లాండులో జరిగిన సదస్సులో ఆమె పాల్గొన్నారు.

కాగా, సమగ్ర సర్వేలో కల్వకుంట్ల కవిత నిజామాబాద్, హైదరాబాదులలో వివరాలు నమోదు చేయించుకున్నారని రేవంత్ రెడ్డి సభలో మూడు రోజుల క్రితం ఆరోపించారు. దీని పైన తెరాస అప్పటికి అప్పుడు స్పందించలేదు. మరుసటి రోజు తెరాస రేవంత్ వ్యాఖ్యల పైన మండిపడింది. దీనికి రేవంత్ స్పందిస్తూ.. తాను పత్రికలో వచ్చిన ఆధారాలు చూపిస్తానని చెప్పారు. ఆయన సభాపతికి అందుకు సంబంధించిన సమాచారం ఇచ్చారు.

అయితే, కవిత రెండుచోట్ల వివరాలు నమోదు చేసుకోలేదని, పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి ఎలా చెబుతారని, అందుకు రేవంత్ క్షమాపణ చెప్పాల్సిందేనని రేవంత్ పైన తెరాస విరుచుకుపడింది. టీడీపీ కూడా ధీటుగానే స్పందించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సభలో తీవ్ర గందరగోళం జరిగింది. దీంతో సభాపతి టీడీపీ సభ్యుల పైన వారం రోజుల పాటు సస్పెన్షన్ విధించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+