జూ ఎన్టీఆర్ రికార్డ్ ఎఫెక్ట్, కాసుల పంట: వీరూ లక్షలు వెచ్చించారు..
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తన రూ.1.21 కోట్ల విలువైన బిఎండబ్ల్యు కారు కోసం టిఎస్09ఈఎల్ 9999 నెంబర్‌ను రూ.10.5 లక్షలకు వేలంలో కైవసం చేసుకున్నారు. ఈ విషయాన్ని నగర రవాణా సంయుక్త కమిషనర్ రఘునాథ్ ఓ ప్రకటనలో తెలిపారు.
నెంబర్ల వేలంతో ఒక్కరోజే రూ.20.31 లక్షల ఆదాయం వచ్చింది. మేఘా ఇంజినీరింగ్ కంపెనీ టిఎస్09 ఈఎం0009 నెంబరును రూ.1.20 లక్షలకు, మనోజ్ బాబు అనే వ్యక్తి టీఎస్09 ఈఎం0007 నెంబరును రూ.1.65 లక్షలు, ఏఎంఆర్ ఇండియా కంపెనీ టీఎస్09 ఈఎం0006ను రూ.1.10 లక్షలు వెచ్చించి వేలంలో కైవసం చేసుకున్నారు.
శనివారం ఒక్కరోజే నెంబర్ల వేలం ద్వారా ఆర్టీఏకు రూ.20.31 లక్షల ఆదాయం సమకూరింది. రవాణా శాఖ.. కొన్ని నెంబర్ల వేలం ద్వారా ఈ మొత్తాన్ని పొందింది. ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో జూనియర్ ఎన్టీఆర్ రికార్డు ధర చెల్లించి 9999 నెంబర్ దక్కించుకున్నారు.

ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు మాట్లాడుతూ.. ఓ ఫ్యాన్సీ నెంబరుకు ఇంత మొత్తం (జూనియర్ ఎన్టీఆర్ కొన్న ధర) చెల్లించడం ఇది రికార్డ్ అని చెప్పారు. ఇప్పటి వరకు ఫ్యాన్సీ నెంబర్ కోసం ఇంత పెద్ద మొత్తాన్ని ఎవరూ ఖర్చు చేయలేదని చెప్పారు.
జూనియర్ ఎన్టీఆర్ తర్వాత మరో ఫ్యాన్సీ నెంబర్‌ను ఓ కాంట్రాక్టర్ రూ.6 లక్షలకు దక్కించుకున్నారు. జూ ఎన్టీఆర్ దక్కించుకున్న 9999 ఫ్యాన్సీ నెంబర్ కోసం ఆర్టీఏ అధికారులు రూ.50వేలను ప్రాథమిక ధరగా పెట్టారు. కానీ అది ఏకంగా పదిలక్షలకు పైగా పలికింది.
గతంలో జూనియర్ ఎన్టీఆర్ రూ.5 లక్షలు చెల్లించి తన లక్జరీ కార్లకు 9999 నెంబర్లను కొన్నారు. '9999' పైన జూనియర్ ఎన్టీఆర్ మక్కువ ఇదే తొలిసారి కాదు. అందుకు గతంలో తన కార్ల కోసం అతను లక్షలాది రూపాయలు వెచ్చించారు.
గతంలో అదిలాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో ఓ ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నారు. జూ ఎన్టీఆర్ హైదరాబాదులో ఉంటుండటంతో అది వివాదమై.. రద్దు చేయబడింది. ఆ తర్వాత హైదరాబాదులో నెంబర్ తీసుకున్నారు. శనివారం నాడు రూ.10.5 లక్షలకు దక్కించుకున్న ఫ్యాన్సీ నెంబర్ కోసం ఎన్టీఆర్ స్వయంగా రాలేదు. అథను జనతా గ్యారేజ్ సినిమా షూటింగులో ఉన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications