టిఆర్ఎస్‌లో కలవరం: హరీష్ రావు బ్యాక్ బెంచ్
హైదరాబాద్: హంగూ ఆర్భాటాలతో శుక్రవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్లీనరీ సమావేశానికి సంబంధించిన ఓ వార్త చర్చనీయాంశంగా మారింది. హరీష్ రావు వెనక బెంచీ అంటూ వచ్చిన వార్తాకథనాలు టిఆర్ఎస్ కార్యకర్తలను కలవరానికి గురి చేస్తున్నాయి. టీఆర్‌ఎస్ ప్లీనరీ వేదికపై తెలంగాణ సీఎం కేసీఆర్ మేనల్లుడు, రాష్ట్ర మంత్రి టి. హరీశ్‌రావు వెనుక వరుసలో కూర్చోవటం పార్టీలో చర్చనీయాంశంగా మారిందంటూ శనివారం మీడియాలో వార్తలు వచ్చాయి.
ప్లీనరీ మొదలైనప్పటి నుంచి ముగిసేవరకు ఆయన గతంలో మాదిరిగా చురుకుగా కనిపించలేదని ఓ ప్రముఖ దినపత్రిక వ్యాఖ్యానించింది. 2001లో టీఆర్‌ఎస్‌ను స్థాపించినప్పటినుంచి హరీష్ రావు కీలకమైన భూమికనే పోషిస్తూ వస్తున్నారు.
14 ఏళ్లుగా మెదక్ జిల్లా సిద్దిపేట అసెంబ్లీ స్థానం నుంచి భారీ మెజార్టీతో హరీష్ రావు గెలుస్తున్నారు. శుక్రవారం నాటి టీఆర్‌ఎస్ ప్లీనరీ ఏర్పాట్లలో మంత్రి హరీశ్‌రావుకు భాగస్వామ్యం లేకుండా పోయిందనే ప్రచారం జరిగింది. ప్లీనరీతోపాటు 27న పార్టీ ఆవిర్భావ దినం సందర్భంగా జరిగే బహిరంగ సభ ఏర్పాట్ల కమిటీల్లోనూ హరీశ్ రావుకు బాధ్యతలు ఇవ్వలేదని పార్టీ ముఖ్యులు కొందరు అంతర్గత సంభాషణల్లో అంగీకరించారంటూ మీడియా వార్తలు వచ్చాయి.

ప్లీనరీ ఏర్పాట్లన్నీ కేసీఆర్ తనయుడు, మంత్రి కెటి రామారావు కనుసన్నల్లోనే జరిగాయి. మంత్రులు ప్లీనరీ వేదిక ఎల్బీ స్టేడియాన్ని సందర్శించి ఏర్పాట్లు పరిశీలించినప్పటికీ, హరీశ్ రావు మాత్రం అటువైపు కన్నెత్తి చూడలేదు.
ప్లీనరీ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగుల్లో హరీశ్ రావు ఫొటోలు పెద్దగా కనిపించలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. శుక్రవారం ఉదయం ప్లీనరీ ప్రారంభానికి ముందే ఎల్బీ స్టేడియంకు చేరుకున్న హరీశ్‌రావు తొలుత వేదికపైకి వెళ్లలేదు. మిగిలిన మంత్రులు అందరూ వేదికపై ముందు వరుసలో కూర్చున్నప్పటికీ, ఆయన మాత్రం చాలాసేపు వేదిక ముందున్న గ్యాలరీలో ప్రతినిధులతో కలిసి కూర్చున్నారు. సీఎం కేసీఆర్ వచ్చిన కొద్దిసేపటికి ఆయన వేదికపైకి వచ్చారు.
అయితే మూడో వరుసలో కూర్చున్నారు. పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించగానే చాలా మంది వచ్చి ఆయనను అభినందించారు. కానీ హరీశ్ మాత్రం కేసీఆర్ వద్దకు రాకపోవటాన్ని పార్టీ ప్రతినిధులు గుర్తించారు. మొత్తం మీద, హరీష్ రావుకు సంబంధించిన వార్తాకథనాలు సంచలనంగానే మారాయి.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications