Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కిమ్‌కు ట్రంప్ షాక్: 'ఉ.కొరియాతో చర్చలొద్దు, ఆ తప్పులు నేను చేయను'

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తరకొరియాతో చర్చలు శుద్ద దండగని చెప్పారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రెక్స్ టెల్లెర్‌సన్ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ మండిపడ్డారు.ఉత్తరకొరియాతో చర్చలు జరపడం సమయాన్ని వృధా చేసుకోవడమేనని చెప్పారు.

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ అణుపరీక్షలు, క్షిపణుల ప్రయోగంతో ప్రపంచదేశాలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. కిమ్‌ను కట్టడి చేసేందుకు అమెరికా దాని మిత్రదేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి.

అయితే యుద్దానికి కంటే ముందుగా మరోసారి కిమ్‌తో చర్చించాలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి రెక్స్ టెల్లెర్‌సన్ ప్రతిపాదించారు. కిమ్‌తో చర్చలకు తాము సిద్దంగా ఉన్నామని చెప్పారు.

చైనా పర్యటనలో ఉన్న రెక్స్ చేసిన ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకొంది. అయితే ఈ ప్రకటన చేసిన కొద్దిగంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ చర్చలు అవసరం లేదని ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.

ఉత్తరకొరియాతో చర్చలు అవసరం లేదు

ఉత్తరకొరియాతో చర్చలు అవసరం లేదు

ఉత్తర కొరియా విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుపడ్డారు. ఉత్తర కొరియాతో సంప్రదింపులు జరుపుతామంటూ తమ విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లర్‌సన్‌ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్‌ మండిపడ్డారు. ఉత్తర కొరియాతో సంప్రదింపులు జరుపడం శుద్ధ దండగని, సమయాన్ని వృధా చేయడమేనని ఆయనకు ట్రంప్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

ఇతరుల మాదిరిగా వైఫల్యం చెందను

ఇతరుల మాదిరిగా వైఫల్యం చెందను

జార్జ్‌ బుష్‌, బిల్‌ క్లింటన్‌, బరాక్‌ ఒబామా లాగా తాను విఫలం చెందనని చెప్పారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ''మా అత్యంత అద్భుతమైన విదేశాంగ మంత్రి రెక్స్‌ టిల్లరసన్‌కి చెబుతున్నా. లిటిల్‌ రాకెట్‌ మ్యాన్‌తో సంప్రదింపులకు ప్రయత్నించడం సమయాన్ని వృధా చేసుకోవడమే. మీలో ఉన్న శక్తిని ఆదా చేసుకోండి. ఇప్పటి వరకు చేసిన మాదిరిగానే మేము మా పనిచేస్తాం'' అని హెచ్చరిస్తూ ట్రంప్‌ పలు ట్వీట్లు చేశారు. రాకెట్‌ మ్యాన్‌తో మంచిగా ఉండటం గత 25 సంవత్సరాలుగా కుదరలేదని, మరి ఇప్పుడెందుకు జరుగుతుందంటూ ప్రశ్నించారు.

 నేను ఓడిపోవాలనుకోవడం లేదు

నేను ఓడిపోవాలనుకోవడం లేదు

ఉత్తరకొరియా విషయంలో క్లింటన్‌, బుష్‌, ఒబామాలు విఫలయ్యారని, తాను మాత్రం అసలు ఓడిపోదలుచుకోలేదని చెప్పారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ను ట్రంప్‌ అంతకముందు రాకెట్‌ మ్యాన్‌గా అభివర్ణించారు. చైనాలో ఉన్న టిల్లర్‌సన్‌.. ఉత్తర కొరియాతో నేరుగా మాట్లాడగల కమ్యునికేషన్‌ వ్యవస్థ తమకు ఉందని, దానిని ఇప్పటికీ కొనసాగిస్తున్నామని చెప్పారు.

 ట్రంప్‌కు టెల్లెర్‌సన్‌కు మధ్య విభేధాలు

ట్రంప్‌కు టెల్లెర్‌సన్‌కు మధ్య విభేధాలు

బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను కలిసిన సందర్భంగా ఉత్తరకొరియాతో చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయని టెల్లెర్‌సన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉత్తర కొరియా, అమెరికాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో యుద్ధ వాతావరణం నెలకొంది. టిల్లర్‌సన్‌పై నిర్ణయాన్ని తప్పుబడుతూ ట్రంప్‌ చేసిన ట్వీట్లను అమెరికా మీడియా భారీ ఎత్తున ఎత్తిచూపింది. అధ్యక్షుడికి, విదేశాంగ మంత్రికి మధ్య ఉన్న తేడాను అమెరికా మీడియా ఎక్కువగా హైలైట్‌ చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+