వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన్మథ నామ సంవత్సరం: దేశ, రాష్ట్ర భవిష్యత్తు?

By Pratap
|
Google Oneindia TeluguNews

దేశంలోని గోచార ఫలితాలు: ఈ సంవత్సరము 9 మంది ప్రధాన నాయకులలో ఆరుగురు శుభులు. 21 మంది ఉప నాయకులలో పదునాలుగు మందికి శుభత్వం కలిగినది. కాగా ప్రధానముగా ఈ సంవత్సరము
ప్రజల యొక్క, నాయకుల యొక్క ఆలోచనలు, సమర్ధతలు ఎక్కువగా మంచివైపు మొగ్గు చూపిస్తున్నా మొత్తము మీద ప్రజలు, ఉద్యోగులు, ప్రభుత్వము, అధిపతులు అందరు కూడా ఎవరికి వారు ఎదుటవారి మీద ఆధిపత్యమును చూపించుకుంటారు.

చెడుపరిస్థితులు

సంవత్సరరాజు స్వాభావికముగా మందగ్రహము అగుటవల్ల, సేనాధిపతి యొక్క స్వాభావిక మెతకతనముచే సమాజంలో అతివాద, తీవ్రవాద ధోరణులు పెరిగే సూచనలు ఉన్నాయి, వారిని అదుపు చేయడంలో ప్రభుత్వాలు ,కొంత వరకు సఫలీకృతమవుతాయి. అలాగే అన్ని రంగాలలో నాయకులైన వారికి వారి మొండితనాల వల్ల చిక్కులు, అకాల వైరాలు పెరుగుతాయి. దేశ ఆర్థికత రాజ్యాధిపత్యం శనికి, మంత్రిత్వం కుజునకు రావటం వల్ల అన్ని రంగాలల్లో ఆర్ధిక వ్యూహాలలోను పరస్పర పొంతనలు లేని ఆలోచనలు, సమన్వయము లేని ప్రణాళికలు వస్తాయి. కానిఅవి వీధిమీద పడవు.

పంటలు

సైన్యము, వ్యవసాయం, ధాన్యం, అర్ఘ్యఅధిపతి, మేఘ, నీరసాధిపతులందరు శుభగ్రహాలు అగుట వల్ల మొత్తము మీద ఈ సంవత్సరము పంటలు బాగా పెరుగు సూచనలు ఉన్నాయి. కాగా, వర్షాలు సమృద్ధిగా ఉన్నప్పటికిని కొన్ని ప్రాంతములలో పంటనష్టముల తీవ్రత ఎక్కువగా ఉండుట వంటివి జరుగుతాయి.
``````````
విశేషించి తెలుగు రాష్ట్రాలలో...

ప్రభుత్వ పాలనా విషయంలో పాలకులలో మంచిమార్పు, ప్రణాళికలతో అభివృద్ధి మార్గంలో ప్రారంభిస్తారు, వారికి ఇతర నాయకుల సహాయ సహకారములు కూడా ఉండి, తద్ద్వారా రాష్ట్రాభివృద్ధి పనులలో వేగిరంకలిగి ప్రజల పురోగతికి దోహదం కలుగుతాయి. పంటల వృద్ధి ఎక్కువగా ఉంటుంది కరువులు తక్కువగా ఉంటాయి.

రాష్ట్ర ` దేశ ఆర్థిక పరిస్థితి

మెరుగుగానే ఉన్నప్పటికీ, ప్రజోపయోగ పథకములవిషయంలో ఎక్కువ ఆర్ధిక జాప్యత వల్ల ప్రజలకు అసంతృప్తి ఏర్పడుతుంది. అలాగే అనవసర ఖర్చులు బాగా పెరుగుతాయి.

జగల్లగ్నమైన కర్కాటమును పరిశీలించగా మొత్తం మీదకేంద్ర ప్రభుత్వ వ్యవహారాలు స్థిరమైన నిర్ణయాలప్రకారం పూర్తిచేస్తారు. అలాగే కేంద్రంలోని పాలకుల సమర్థత వలన అంతర్జాతీయంగా మన దేశఖ్యాతి వృద్ధి చెందుతుంది, కుటుంబ వ్యవహారాలలో కొంత అశాంతి ఉన్నప్పటికి సామరస్య ధోరణితో ముందుకు సాగుతారు. బ్యాంకింగ్‌ రంగములో ఆరోగ్యవంతమైన పోటీ తత్వము పెరిగి ఖాతాదారులకు తగిన సేవనును అందిస్తాయి.

ద్వితీయస్థానమును పరిశీలించగా దేశ ఆర్థికవిధానాలలో ముందుచూపు నిర్ణయాలు, పాలకుల స్పందనసేవ సరిగ్గా అందిస్తారు. అలాగే అంతర్జాతీయ స్నేహసంబంధాల వలన ఇతర దేశాలనుండి ఆర్థిక ఋణసహాయమును అధికముగా తీసుకువస్తారు, దేశంలోని ,దేశంబయటిశత్రువులను సమర్థవంతంగా అణచగలుగుతారు. రవాణారంగం `పరిశీలించగా సమస్యలను ఎదుర్కొనే అవకాశాలున్నాయి.రవాణాఛార్జీలు పెరుగుతాయి. అలాగే పత్రికా, సమాచార రంగాలలోను ప్రతిభకు తగిన ప్రోత్సాహము తగ్గుతుంది.

 Ugadi Panchamgam: Manmatha Nama Telugu year

చతుర్థస్థానమును వ్యవసాయ, రియలెస్టేటు రంగాలలో కొంత మంచి పరిణామములు ఉన్నవి.
తృతీయస్థానమును పరిశీలించగా ఇతర దేశాలతో దౌత్య సంబంధాలు, ఒప్పందాలు కుదర్చడంలో ప్రభుత్వం సమర్ధతతో వ్యవహరించి ఊహించని పురోగతిని సాధిస్తుంది. సమాచార రంగంలో విప్లవాత్మకమైన మార్పులు, సంస్కరణలు వస్తాయి. కాగా, కొన్ని ఆకస్మిక దుర్ఘటనలు జాతీయ రహదారుల అభివృద్ధికి ఆటంకముగా మారుతాయి.విద్యారంగంలో విద్యార్థుల ప్రతిభలు జాతీయఖ్యాతినందుతాయి. సమర్థులైన వైజ్ఞానికులు, వైద్యులు ఉన్నప్పటికిని విద్యార్థి సంఘములలో కుటిల రాజకీయమలు ప్రవేశించి సమాజమునకు, ఆయా రంగాలలో అంతర్జాతీయ స్థాయికి తగిన కృషిని ప్రోత్సహించ లేని పరిస్థితిని సృష్టించును. కాగా, నూతన విశ్వవిద్యాలయములు తెరుచుటకుఅవకాశాలఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయ రంగములో సానుకూల సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి. గత అనుభవములతో రైతులు, ప్రభుత్వము కూడ ఆహార ధాన్యముల విషయములో శ్రద్ధ వహిస్తారు.

పంచమ స్థానమును స్త్రీ,శిశుసంక్షేమం, సంగీత, సాహిత్య, పరిశోధనా రంగాలలో ప్రభుత్వ అలసత్వ ధోరణి కొంత ఉంటుంది కానీ ప్రభుత్వేతర సహకారం, ప్రోత్సాహాలతో కాస్త నిలదొక్కుకుంటాయి. కాని,వాటి ఫలితాలు
కూడ ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికి ప్రభుత్వ ధరల విధానాలు రైతులకు నష్టాన్ని, అసంతృప్తిని కలిగించవచ్చు.

పంచమ స్థానమును పరిశీలించగా సంగీత, సాహిత్య, కళారంగాలలో మన దేశ కళాకారులకు, పరిశోధన సంస్థలకు అంతర్జాతీయ స్థాయి ఉన్నప్పటికిని ప్రభుత్వ ప్రోత్సాహం కొంత తగ్గవచ్చును. పోటీ
పరిశీలించగా అన్ని రంగాలలోను ఆరోగ్యకరమైన పోటీకి తగినట్లు అభివృద్ధి కనిపించుచున్నది. భద్రతాదళ, శ్రామిక వ్యవస్థల అభివృద్ధికై నిధులు పెంచవలసివచ్చును.
షష్ఠ స్థానమును పరిశీలించగా శత్రుదేశముల వెన్నుపోట్లను సమర్ధవంతముగా త్రిప్పికొట్టడం, ఉగ్రవాదులను అణగద్రొక్కు విధానముతో అంతర్జాతీయముగా మన దేశానికి మద్దతు పెరుతుంది.
సంబంధాలు
పరిశీలించగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు పెరుగుతాయి రాష్ట్రానికి బాగా అండ ఉంటుంది. రాష్ట్ర వాణిజ్య వ్యవహారాలు బాగా అభివృద్ధి పథంలో కొనసాగుతాయి. అలాగే వివాహ వ్యవస్థలు ఆదర్శవంతముగా ఉండి కుటుంబవిలువలకు ప్రాధాన్యత పెరుగుతుంది.

సప్తము స్థానమును పరిశీలించగా విదేశములతో అనుకూల సంబంధాలను వాణిజ్యపరంగాను, వ్యావహారికపరంగాను వృద్ధి సమర్థవంతముగా వ్యవహరిస్తాయి.

విపత్తులు పరిశీలించగా రాష్ట్రంలో ప్రభుత్వరంగ సంస్థలలో రహస్యములు బయటపడుట ద్వారా ప్రభుత్వం కొంత అప్రతిష్ఠ పాలు కావలసివచ్చును. అలాగే మరణాంతకమైన అంటు వ్యాధులు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. కరువు కాటకాలు పెరిగే సూచనలున్నాయి.

నవమస్థానమును పరిశీలించగా మత సంబంధ విషయాలలో ఘర్షణఉంటుందికానీ ప్రభుత్వము వల్ల అవి కొంత సద్దుమణుగుతాయి. సమాజంలో ఆధ్యాత్మిక విలువలుపెరిగి కొంత ధర్మానికికట్టుబడి ఉండే లక్షణములు ఉన్నాయి. ప్రభుత్వపరంగా కూడా తగిన ప్రోత్సాహం లభిస్తుంది.

షేర్‌ మార్కెట్లు, స్పెక్యులేషన్‌ వ్యవహారాలు, ఆర్థిక వ్యాపారాలలో మంచిమార్పు కనిపిస్తున్నది.
వైజ్ఞానిక పరిశోధన విషయాలలో రాష్ట్ర విద్యార్థులు జాతీయ స్థాయిలో విజయాలను సాధిస్తారు. న్యాయ వ్యవస్థలో కొంతవరకే సత్ఫలితాలుంటాయి

వృత్తులు పరిశీలించగా ప్రభుత్వరంగ సంస్థలలో పరస్పరం కలిసి మెలిసి ఉంటారు . అలాగే, గ్రామీణ, వ్యవసాయ రంగాలలో ప్రభుత్వ మంచి దిగుబడులు, ఉత్పత్తులు బాగా పెరిగి ఆ రంగంలోని వారికి మంచి ఉత్సాహాన్ని కలిగిస్తాయి.

పరిశీలించగా దేశంలో ఆధ్యాత్మిక భావాలు, ప్రజలలో దేశభక్తి, జాతీయభావములు బాగా పెరుగుతాయి.
నౌకావ్యాపారములు అభివృద్ధి చెందుటకు అవకాశం కలదు.

ఆర్థిక సంస్కరణల విషయాలలో లోపాలను సరిచేయడంలో ప్రభుత్వం సమర్థం కాలేరు. కాగా కొన్ని క్లిష్ట వ్యవహారాలలో న్యాయవ్యవస్థ మరింత చొరవ తీసుకుని సమస్యల పరిష్కారానికి చురుకుగా వ్యవహరిస్తుంది.

ప్రభుత్వాదాయం పరిశీలించగా ప్రభుత్వానికి వివిధమార్గాల ద్వారా ఆదాయు పెరుగు సూచనలు ఉన్నాయి కాని వాటికి గండి కొట్టే వారిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమయ్యే వల్ల రాష్ట్రంలో ఆరోగ్య పథకములు
వంటి ప్రజోపయోగ పనులకు తీవ్ర అంతరాయాలుఓటాయి, నష్టం ఏర్పడుతుంది.కాగా, ప్రభుత్వం అట్టి వారిని అదుపు చేయటంలో కొంతవరకే విజయం సాధిస్తుంది.

దశమస్థానమును పరిశీలించగా పారిశ్రామిక రంగములోను, విశేషించి భారీ పరిశ్రమరంగంలో మంచి వాతావరణం ఏర్పడి నిలకడ గల అభివృద్ధిని సాధించడం జరుగుతుంది. యాజమాన్య కార్మిక సంబంధములు మొత్తము మీద తృప్తికరంగా ఉండగలవు.

ఏకాదశ స్థానమును పరిశీలించగా దేశంలో నిరుద్యోగ తీవ్రత తగ్గును. ప్రభుత్వము వివిధ పథకముల ద్వారా సమృద్ధిగా ఆదాయ వనరులు సమీకరించుకొనును. కాగా, వ్యాపారరంగంలో లాభాలు పొంగి పొరలుచున్నట్లు పైకి కనిపించు చుండగానే వ్యాపారములు మునిగిపోవు సన్నివేశములు కలుగవచ్చును.

ద్వాదశస్థానమును పరిశీలించగా విప్లవకారులు, ఉగ్రవాదులు, రాజకీయ ఆందోళనకారులు దౌర్జన్యాలకు, తీవ్ర అంతరాయాలకు పాల్పడుతూండటం, వారిని సకాలంలో నియంత్రించే విషయంలో ప్రభుత్వం కొంతవరకే విజయం సాధించే సూచనలున్నాయి.

మొత్తం మీద ఈ సంవత్సరము రాజకీయ, ఆర్థిక సుస్థిరత విషయములో మాత్రము ముందడుగు కనిపిస్తోంది. ప్రజలు నాయకులు తమకు కలిగిన ఆధ్యాత్మిక దృష్టిని మరింత పెంచుకొని, విశేషముగా దత్తాత్రోయోపాసన అధికంగా చేసి, ఆ దత్తుడి అనుగ్రహముచే ప్రగతిని, సన్మంగళములు పొందుదురు గాక ! శుభమ్‌ !!

- మారుతి శర్మ

English summary
An astrologer Maruthi Sharma in his Panchangam describes the future in Telugu New Year Manmatha Nama year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X