వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు రాజధాని కలకు లేఔట్ల బెడద

By Pratap
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి రాజధాని స్వప్నానికి అనధికారిక లే అవుట్లు బెడదగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో విజయవాడ సమీపంలో రాజధానిని నిర్మించాలనే చంద్రబాబు ఆలోచనలకు లే అవుట్లు ఆటంకంగా మారవచ్చునంటూ వార్తా కథనాలు వెలువడుతున్నాయి.

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అనధికారికంగా, ప్రణాళికబద్ధం కాని లేఅవుట్లు బోలెడు జరిగాయని అంటున్నారు. విజిటిఎం పట్టణాభిువృద్ధి సంస్థ అధికారులు, రెవెన్యూ అధికారులు కల్పించుకుని ఆ ప్రమాదాన్ని నివారించకపోతే భూముల క్రయవిక్రయాల్లో ఇబ్బందులు ఏర్పడి నష్టాలు వాటిల్లవచ్చునని అంటున్నారు.

Unauthorised layouts to mar Andhra Pradesh capital dream

ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొరవడి ప్రణాళికాబద్ధంగా లేని లేఅవుట్లు తామరతంపరగా వచ్చాయని సమాచారం. పట్టణాభివృద్ధి సంస్థ అధికారులు, గ్రామ స్థాయి సిబ్బంది క్షేత్ర స్థాయి సిబ్బందితో కలిసి రియల్టర్లు వెంచర్లతో ముందుకు వస్తున్నట్లు చెబుతున్నారు.

అనధికారిక లేఅవుట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజిటిఎం పట్టణాభివృద్ధి శాఖ అధికారులు హెచ్చరికలు చేసి చేతులు దులుపుకున్నారు. రెవెన్యూ అధికారుల సహకారం లేకపోతే తాము ఏమీ చేయలేమని వారంటున్నారు.

English summary

 An increasing number of unauthorised layouts in Krishna and Guntur districts is likely to mar Chief Minister, Mr N. Chandrababu Naidu’s plans to develop a world class state capital for Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X