బిగ్ డిబేట్‌లో గెలుపెవరిది?: ట్రంప్‌పై హిల్లరీ పైచేయి, కారణాలివే!

న్యూయార్క్: అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్ధి రేసులో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్‌కు తొలి బిగ్ డిబేట్‌లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం న్యూయార్క్‌లోని హోఫ్‌స్ట్రా యూనివర్సిటీ హాల్‌లో జరిగిన తొలి బిగ్ డిబేట్‌లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ విజయం సాధించింది.

ఈ బిగ్ డిబేట్‌లో ఆమెకు 62 శాతం మద్దతు లభించగా, డోనాల్డ్ ట్రంప్‌కు 27శాతం మద్దతు మాత్రమే దక్కిందని సీఎఎన్ఎన్-ఓఆర్సీ సంస్థ నిర్వహించిన పోల్ సర్వేలో వెల్లడైంది. తొలి బిగ్ డిబేట్ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా సుమారు 100 మిలియన్ల మంది వీక్షించారని సర్వే పేర్కొంది.

 62 శాతం మంది హిల్లరీకి మద్దతివ్వగా 27శాతం మంది ట్రంప్‌కు

62 శాతం మంది హిల్లరీకి మద్దతివ్వగా 27శాతం మంది ట్రంప్‌కు

బిగ్ డిబేట్ జరుగుతున్న సమయంలోనే సీఎన్ఎన్-ఓఆర్సీ వీక్షకుల నుంచి పోల్ ద్వారా అభిప్రాయాన్ని కోరగా, 62 శాతం మంది హిల్లరీకి మద్దతివ్వగా 27శాతం మంది ట్రంప్‌కు మద్దతిచ్చారు. కాగా తొలి బిగ్ డిబేట్ కార్యక్రమం ఇద్దరి మధ్యా సుమారు 90 నిమిషాల పాటు కొనసాగింది. ఈ బిగ్ డిబేట్‌లో అమెరికా దశదిశ, ప్రజల భద్రత, శ్రేయస్సు అనే అంశాలపై చర్చ జరిగింది. ఈ డిబేట్‌లో హిల్లరీ చాలా స్పష్టమైన సమాధానాలు చెప్పారు. అంతేకాదు ట్రంప్ విమర్శలను సైతం చాలా తెలివిగా తిప్పికొట్టారు. ట్రంప్ మాత్రం హిల్లరీపై వ్యక్తిగత దూషణలకు కూడా పాల్పడ్డారు.

చాలా తెలివిగా సమాధానాలు చెప్పిన హిల్లరీ క్లింటన్

చాలా తెలివిగా సమాధానాలు చెప్పిన హిల్లరీ క్లింటన్

అమెరికన్ ప్రజలకు ఉద్యోగవకాశాల కల్పనపై అడిగిన ప్రశ్నకు గాను హిల్లరీ ఉద్యోగాల కల్పనకు ఎన్నో మార్గాలు ఉన్నాయని చెప్పారు. ట్రంప్ మాత్రం కంపెనీలకు ఇన్సెంటివ్‌లు ఇస్తామని చెప్పడంతో పాటు 35శాతం పన్నును 15శాతానికి తగ్గిస్తామని అన్నారు. దీనికి కౌంటర్‌గా హిల్లరీ పన్ను మినహాయింపు వల్ల ధనవంతులే బాగుపడతారని అన్నారు. తమ ప్రభుత్వం సామాన్యులు, మధ్యతరగతి వారికి లభ్ధి చేకూరుస్తుందని పేర్కొన్నారు. కార్పొరేట్ లొసుగులు సైతం తొలిగిస్తామని చెప్పారు. ట్రంప్ తాను డిబేట్ కోసం సిద్ధమవ్వలేదని అధ్యక్ష పదవి కోసం సిద్ధమయ్యానని చెప్పడంతో పాటు ఈ డిబేట్ గెలవడమే లక్ష్యంగా హిల్లరీ ప్రిపేర్ అయి వచ్చిందని, ఆమె గెలుస్తుంది అని చెప్పారు.

తొలి డిబేట్‌లో అమెరికన్ల మనసు గెలుచుకున్న హిల్లరీ

తొలి డిబేట్‌లో అమెరికన్ల మనసు గెలుచుకున్న హిల్లరీ

దీంతో, తాను అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నందున తన దేశ ప్రజలకు ఏమేం చేయగలననే అంశాలనే చెప్తున్నానని, ఆ మాత్రం బాధ్యతగా ప్రిపేర్ అవ్వకుంటే ఎలా అంటూ స్మార్ట్‌గా సమాధానం ఇచ్చారు. ఇలా తెలివిగా మాట్లాడుతూ అటు వీక్షకులను, ఇటు అమెరికన్ ప్రజల మద్దతు కూడగట్టుకున్నారు. అయితే గతంలో నిర్వహించిన సర్వేలో హిల్లరీ, ట్రంప్‌ల మధ్య కొద్ది వ్యత్యాసం మాత్రమే ఉంది. ఈ నెల 19న వెల్లడైన సర్వేలో కూడా డోనాల్డ్ ట్రంప్‌పై హిల్లరీ స్వల్ప ఆధిక్యంలో కొనసాగారు. అప్పుడు లైక్లీ ఓటర్లలో హిల్లరీకి 42 శాతం, ట్రంప్‌కు 40 శాంత మంది మద్దతు ఉన్నట్లు మార్నింగ్ కన్సల్ట్ పోల్ వెల్లడించింది.

 ఆమెరికన్లలో ట్రంప్ సరైన అభ్యర్ధి కాదనే భావన

ఆమెరికన్లలో ట్రంప్ సరైన అభ్యర్ధి కాదనే భావన

రిజిస్టర్డ్ ఓటర్లలో 39శాతం మంది హిల్లరీకి, 38శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నట్లు పొలిటికో సంస్థ కూడా పేర్కొంది. న్యుమోనియాతో బాధపడుతూ ఒక బహిరంగ సభలోనే కుప్పకూలక ముందు హిల్లరీ ట్రంప్‌ల మధ్య 41-39 తేడా ఉండేది. వాస్తవానికి, ట్రంప్‌కు సొంత పార్టీలోనే మద్దతు అంతగా లేదు. పార్టీ తరుఫున అతడు సరైన అభ్యర్థి కాదని 43 శాతం మంది రిపబ్లికన్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+