మోడీ వర్సెస్ మమతా: వీడనున్న నేతాజీ మిస్టరీ?
కోల్‌కతా: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతిపై నెలకొన్న మిస్టరీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన ఫైళ్లను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం విడుదలచేసింది. మొత్తం 12,744 పేజీలతో కూడిన 64 రహస్య ఫైళ్లను శనివారం నేతాజీ కుటుంబ సభ్యులకు అందజేసింది.
కేంద్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కారణంగానే మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం నేతాజీ ఫైళ్లను బహిర్గతం చేసేందుకు పూనుకున్నట్లు తెలుస్తోంది. నేతాజీకి సంబంధించిన ప్రతీ ఫైల్‌ను మమత ప్రభుత్వం డిజిటైలేజేషన్ చేసింది.
నేతాజీ కుటుంబానికి ఫైళ్లను డివిడీల రూపంలో రాష్ట్ర హోంశాఖ అందించింది. కాగా, సోమవారం(సెప్టెంబర్ 21) నుంచి కోల్‌కతా మ్యూజియంలో నేతాజీకి సంబంధించిన ఫైళ్లను ఉంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రస్తుతం ఆ ఫైళ్లను పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో ఉంచింది.
కాగా, వివిధ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయనే ఉద్దేశంతో ఎన్నో ఏళ్లుగా రహస్యంగా ఉంచిన నేతాజీ ఫైళ్లను మమత ప్రభుత్వం బహిర్గతం చేయడంపై కేంద్రం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. జాతీయ అంశాలకు సంబంధించిన అంశాలను రాష్ట్రం ప్రభుత్వం చేపట్టడంపై కేంద్రం స్పందించే అవకాశం ఉంది.

అయితే నేతాజీ కోల్‌కతాలోనే జన్మించి అక్కడి నుంచే తన స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రారంభించారు. మమత ప్రభుత్వం నేతాజీ ఫైళ్లను బహిర్గతం చేయడంతో కేంద్రంతో ఆమె ఢీకొంటున్నట్లు కనిస్తోంది.
కాగా, గత దశాబ్దాల నుంచి మిస్టరీగా ఉన్న నేతాజీ మరణం, ఆయనకు సంబందించిన పలు విషయాలు ఈ ఫైళ్ల ద్వారా తెలిసే అవకాశం ఉంది. ఓ విమాన ప్రమాదంలో నేతాజీ చనిపోయారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
ఇది ఇలా ఉండగా, మరికొందరు నేతాజీ బతికే ఉన్నారంటూ వాదించారు. ఈ నేపథ్యంలో నేతాజీ మృతికి సంబంధించిన కొన్ని విషయాలు ఈ ఫైళ్లలో ఉండవచ్చని ఆయన కుటుంబసభ్యులు భావిస్తున్నారు.
Kolkata: CDs of digitized form of 64 files relating to Netaji being distributed among public and Bose family members pic.twitter.com/DWZWI6MbVW
— ANI (@ANI_news) September 18, 2015 64 Netaji files kept in Kolkata Police Museum for public viewing (In pic: SC Bose's grandnephew) pic.twitter.com/UPoWOdribi
— ANI (@ANI_news) September 18, 2015 WB Govt declassifies 64 files relating to Netaji SC Bose, kept in Kolkata Police Museum for public viewing. pic.twitter.com/LrLGDArG0n
— ANI (@ANI_news) September 18, 2015 -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications