బావైతే బెస్ట్.. చిన్నవాడైతే మరీ బెస్ట్: పెళ్లిపై యువతులు ఇంకేమన్నారంటే!

చాలామంది అమ్మాయిలు.. తమ కన్నా చిన్న వయసు వాడినే పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారట. 97శాతం మంది అమ్మాయిలు ఇదే అభిప్రాయం చెప్పినట్లు సమాచారం.

న్యూఢిల్లీ: నా అనుకున్నవాళ్ల మధ్యే మహిళలకు రక్షణ లేకుండా పోతున్న ఘటనలు అనేకం చూస్తున్నాం. ఇక పెళ్లిళ్ల విషయంలో అయితే.. అప్పటిదాకా ముక్కూ మొహం కూడా తెలియని వ్యక్తితో జీవితకాల ప్రయాణానికి సిద్దం కావాలి.
పెళ్లంటే కట్న, కానుకలు ఇతరత్రా విషయాలు ప్రభావం చూపుతాయి కాబట్టి.. చాలా సందర్భాల్లో సర్దుకుపోవడమే తప్పించి నచ్చినవాడిని భర్తగా ఎంచుకునే అవకాశం మహిళలకు తక్కువే.

ఇలాంటి తరుణంలో అసలు నేటితరం యువతుల ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ఓ మ్యాట్రిమోనీ సర్వే నిర్వహించింది. కాబోయేవాడి విషయంలో నేటితరం యువతులు ఏం కోరుకుంటున్నారు? అన్న అంశాన్ని పరిగణలోకి తీసుకుని ఈ సర్వే నిర్వహించారు.

What Do Indian Women REALLY Think About Marriage?

ఈ మేరకు చాలామంది అమ్మాయిలు.. తమ కన్నా చిన్న వయసు వాడినే పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారట. 97శాతం మంది అమ్మాయిలు ఇదే అభిప్రాయం చెప్పినట్లు సమాచారం. అలాగే మరో 80శాతం మంది అమ్మాయిలు మేన బావను వివాహమాడేందుకే మొగ్గు చూపుతున్నారట.

ఇక ఉమ్మడి కుటుంబాలంటేనే ఇష్టమని 95శాతం మంది అమ్మాయిలు అభిప్రాయపడటం గమనార్హం. పెళ్లి కాగానే వేరు కాపురానికి సిద్దపడుతున్న తరుణంలో.. ఇప్పటి యువతులు ఉమ్మడి కుటుంబాలను కోరుకోవడం మంచి పరిణామమే. ఇక కొంతమంది అమ్మాయిలైతే అబ్బాయిలే ఇల్లు క్లీన్ చేసి, అంతా నీట్‌గా సర్ది పెట్టాలని కోరుకుంటున్నారు.

భర్తను ఎలా దారికి తెచ్చుకుంటారన్న ప్రశ్నకు చాలామంది యువతులు తెలివిగా సమాధానం చెప్పారు. టీవీ రిమోట్ తమ చేతిలో ఉన్నప్పుడు.. వాళ్లను బ్లాక్ మెయిల్ చేస్తామన్నారు. లేదా వంట విషయంలో తమ మాట వినాల్సిందే కాబట్టి.. అక్కడే తమ డిమాండ్స్ సాధించుకుంటామన్నారు.

మరికొంతమంది అమ్మాయిలు తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలన్న ఆలోచనతో 85శాతం మంది యువతులు.. తమ ఊరికి దగ్గరివాడిని చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. చివరాఖరిగా షాపింగ్ గురించి ప్రస్తావించగా.. అబ్బాయిలకు సహనం తక్కువని అందుకే అమ్మాయిలతో షాపింగ్‌కు రారని చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+