అగ్రనేతలేక్కడ: పార్టీ కాంటాక్టులోకి రాకపోవడంపై ప్రజాసంఘాల అనుమానాలు
విశాఖపట్టణం :మావోయిస్టు అగ్రనేతలు రామకృష్ణ,గాజర్ల రవి ఎక్కడ ఉన్నారు. ఎన్ కౌంటర్ జరిగిన సమయంలో అక్కడే ఉన్నారా....ఎన్ కౌంటర్ నుండి తప్పించుకొన్నారా....తప్పించుకొంటే ఇంకా పార్టీ కాంటాక్టులోకి ఎందుకు రాలేదు.ఎన్ కౌంటర్ లో గాయపడ్డారా.....అగ్రనేతల ఉనికపై ప్రజాసంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పోలీసుల అదుపులోనే మావో అగ్రనేతలున్నారనే అనుమానాన్ని ప్రజా సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు మాత్రం తమ అదుపులో మావో అగ్రనేతలు లేరని ప్రకటించారు.
ఒడిశా ఎన్ కౌంటర్ ఘటనలో మావో అగ్రనేతలు రామకృష్ణ, గాజర్లరవి, చలపతి లు కూడ ఉన్నారనే వార్తలు వచ్చాయి. కాని , ఎన్ కౌంటర్ లో మరణించిన వారిలో చలపతి, రామకృష్ణ, రవిలు లేరని తర్వాత పోలీసులు ప్రకటించారు. కాని,మావో కీలక నేత దయ ఈ ఘటనలో మరణించారు. ఎన్ కౌంటర్ స్థలంలో దొరికిన కిట్ బ్యాగులు, ఆయుధాల ఆధారంగా 50 మందికి పైగా మావోలు సమావేశమయ్యారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఎన్ కౌంటర్ జరిగిన మరునాడు కాల్పుల్లో మరో నలుగురు మావోలు మృత్యువాత పడ్డారు. అయితే పోలీసులు చేస్తున్న ప్రకటనలను ప్రజాసంఘాల నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఎన్ కౌంటర్ లో మావో అగ్రనేత రామకృష్ణతో పాటు రవి ,చలపతిలను పోలీసులు అదుపులోకి తీసుకొని ఉంటారని విప్లవరచయితల సంఘం నాయకుడు వరవరరావు ఆరోపించారు. ఈ ఆరోపణలను విశాఖ రూరల్ ఎస్ పి ఖండించారు. తమ అదుపులో మావోలు ఎవరూ లేరని ఆయన తేల్చి చెప్పారు.

ఈ నెల 20వ, తేదిన జరిగిన ప్లీనరీకి రామకృష్ణ హాజరయ్యారని పోలీసులు అనుమానిస్తున్నారు.అయితే ఈ నెల 24వ, తేదిన ఎన్ కౌంటర్ జరిగింది. ఎన్ కౌంటర్ జరిగిన నాటినుండి చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో అగ్రనేతల ఉనికిపై ప్రజా సంఘాలు పోలీసుల తీరు పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మావో అగ్రనేతలు పోలీసుల అదుపులోనే ఉన్నారనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.రామకృష్ణ కు గాయాలయ్యాయని తొలుత ప్రచారం సాగింది.గాయాలతో ఆయన తప్పించుకొన్నారని ప్రచారం సాగింది.దీనికతోడు రామకృష్ణ గన్ మెన్లలో ఒకరు మరణించారు.ఈ ఘటనలో ఒకరు సజీవంగా పోలీసులకు దొరికారు. గన్ మెన్లు కొందరు రామకృష్ణను తీసుకెళ్ళారని ప్రచారం సాగింది.
ఎన్ కౌంటర్ లో కొందరు మావోయిస్టులు గాయపడ్డారని స్వయానా ఎపి డిజిపి సాంబశివరావు అనుమానాన్ని వ్యక్తం చేశారు. అయితే వారికి వైద్యం అందించేందుకు సిద్దమన్నారు.అయితే ముందుగా లొంగిపోతామని మీడియాకు సమాచారం ఇస్తే వైద్యచికిత్స అందిస్తామని డిజిపి ప్రకటించడంలో మర్మం ఏమిటని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలోకి హెలిక్యాప్టర్లను వినియోగించడం పై ప్రజాసంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
ఎన్ కౌంటర్ జరిగిన వెంటనే ఆ ప్రాంతానికి హెలిక్యాప్టర్లలో పోలీసులు వెళ్ళే సాహాసం చేయరు.ఆ రకమైన సాహాసం చేశారంటే ఆ ప్రాంతమంతా తమ ఆధీనంలో ఉందని పోలీసులు విశ్వాసంతో ఉండి ఉండాలి...లేదా ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో కీలక నేతలు తమ అదుపులోనే ఉన్నారనే దీమా ఉండవచ్చని ప్రజాసంఘాలు అనుమానిస్తున్నాయి.

మావో అగ్రనేతలు రామకృష్ణ, గాజర్ల రవి, చలపతి లు ఇంకా పార్టీ కాంటాక్టులోకి ఎందుకు రాలేదనే అనుమానాలను ప్రజా సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి.పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహారిస్తున్నారని అర్థమౌతోంది.ఆర్ కె తనయుడు మున్నా ఈ ఎన్ కౌంటర్ లో మరణించాడు.ఆర్ కె మరణించినా ఉద్యమం ఆగదని ఆయన సతీమణి ప్రకటించడం కూడ అనుమానాలను రేకేత్తిస్తోంది.
మావోల అగ్రనేతల ఆచూకీ కోసం ప్రజాసంఘాల నాయకులు కోడ్ భాషలో మాట్లాడుతున్నారని....ఈ కోడ్ భాష ఆధారంగా ఎన్ కౌంటర్ నుండి తప్పించుకొన్న అగ్రనేతల ఆచూకీని తెలుసుకొనేందుకు ప్రజాసంఘాల నాయకులు తమపై నెపం నెడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.తమ అదుపులో మావో అగ్రనేతలు ఎవరూ లేరని విశాఖ రూరల్ ఎస్ పి ప్రకటించారు.
ఎన్ కౌంటర్ కంటే ముందే అక్కడి నుండి వెళ్తే పార్టీ కాంటాక్టులోకి మావో అగ్రనేతలు ఎందుకు రాలేదు.ఎక్కడికి వెళ్ళారు...ఈ ప్రశ్నలకు ఎప్పుడు తెరపడుతోందనేది ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.
-
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు? -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications