23:59:60: నేడు ఒక సెకను అదనం
న్యూయార్క్: ఈ రోజు(జూన్ 30న) నిడివి అధికారికంగా మరో సెకను పాటు పెరగనుంది. 'లీప్' సెకన్ జోడింపే ఇందుకు కారణమని అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) వెల్లడించింది. భూ భ్రమణ వేగం క్రమంగా తగ్గుతున్నందువల్ల దానికి అనుగుణంగా సమయాన్ని సరిచేయడానికి ఇదే మార్గమని పేర్కొంది.
మాములుగా గడియారంలో 23:59:59 చేరుకున్నాక 00:00:00 సమయాన్ని సూచిస్తుంది. అయితే ఈ మంగళవారం మాత్రం ప్రామాణిక గడియారం 23:59:59 తర్వాత 23:59:60కు వెళుతుంది. ఆ తర్వాత 00:00:00ను సూచిస్తుంది. అయితే దీనికి బదులుగా అనేక సమయ వ్యవస్థలను ఒక సెకను పాటు ఆఫ్ చేస్తారు. దీంతో ఒక సెకను ఆగిపోతుంది.

ఒకరోజులో 86400 సెకన్లు ఉంటాయని, జూన్ 30న 86400.002 సెకన్లు నమోదవుతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 1820 ఏండ్ల తర్వాత ఇలా జరగడం ఇదే తొలిసారి అని తెలిపారు. కాలమానంలో వ్యత్యాసం రెండు మిల్లి సెకన్లు (సెకన్‌లో రెండు వేల వంతు) అని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications