టిపై వ్యూహం: సభలోనే కిరణ్ రాజీనామా?

ఈ నేపథ్యంలో ఈ రోజు లేదా రేపు అసెంబ్లీకి బిల్లు రానుంది. 12వ తేది నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. రాష్ట్రపతి విభజన బిల్లుపై అసెంబ్లీకి ఆరువారాల సమయం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే, విభజనను అడ్డుకునేందుకు కిరణ్ తన వంతుగా పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది.
తన వల్ల సాధ్యమయ్యే అన్ని కోణాల పైన ఆయన దృష్టి సారించారు. ఇందుకు బిల్లును ఆలస్యం చేసేందుకు అసెంబ్లీకి అభిప్రాయం తెలిపేందుకు 45 రోజుల సమయం ఇవ్వాలని గతంలోనే రాష్ట్రపతికి లేఖ రాశారు. అధిష్డానం విభజనపై దూకుడుగా వెళ్తున్న నేపథ్యంలో కిరణ్ అవసరమైతే సమావేశాల సమయంలో సభలోనే రాజీనామా చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు.
బిల్లును పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తేనే పార్లమెంటులో ప్రభావం ఉంటుందని కిరణ్ భావిస్తున్నారట. అవసరమైతే రాజీనామా లేకుంటే సాధ్యమైనంత మేరకు బిల్లును అడ్డుకోవడం లేదా మెజార్టీ సభ్యులు వ్యతిరేకించేలా చేసేందుకు వ్యూహాలు పన్నుతున్నారట. బిల్లును సాధ్యమైనంత వరకు ఆలస్యం చేయాలని చూస్తున్నారట.
మరోవైపు, అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులపాటు నిర్వహించాలన్న దానిపై ముఖ్యమంత్రి సోమవారం మంత్రులతో చర్చించారు. రాష్ట్ర విభజన బిల్లు గవర్నర్‌కి ఎప్పుడు వస్తుంది, ఎన్ని రోజుల సమయం ఇస్తారు, దీనిపై ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలా తదితర అంశాలపై చర్చిస్తున్నారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణతోను గంటపాటు భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications