గ్రేటర్‌లో జనసేన పోటీ!: టిడిపి-పవన్ కళ్యాణ్ కలిసేనా?
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఎన్నికల బరిలోకి దిగుతున్నారా? గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేయనుందా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తే.. ప్రత్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ ఆరంగేట్రానికి తెలంగాణ వేదిక అయినట్లు అవుతుంది. హైదరాబాద్ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలోకి దింపేందుకు పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి.
అన్నీ కుదిరితే గ్రేటర్ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నారు. ఎన్నికల గుర్తింపు వచ్చాక పవన్ కళ్యాణ్ తదుపరి కార్యాచరణ ప్రకటిస్తారని జనసేన గతంలో చెప్పింది. ఇటీవలె గుర్తింపు వచ్చింది. అదే సమయంలో త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి.

ఈ నేపథ్యంలో గ్రేటర్ బరిలో జనసేన నిలువవచ్చునని అంటున్నారు. పవన్ కళ్యాణ్ అభ్యర్థులను బరిలోకి దింపినప్పటికీ... టిడిపి - బిజెపి - జనసేన కూటమి తరఫున బరిలోకి దిగవచ్చునని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు.
కానీ, టిడిపి - బిజెపి కూటమికి మద్దతిచ్చారు. ఇప్పుడు టిడిపి - బిజెపి - జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నారు. ఇటీవల బిజెపి నేతలు పవన్ కళ్యాణ్‌ను కలిశారని, కూటమిగా బరిలోకి దిగుతామని కోరారని తెలుస్తోంది. దానికి పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించారని సమాచారం.












Click it and Unblock the Notifications