బెంగుళూరు యాహూలో 2వేలమందికి ఉద్వాసన?
న్యూఢిల్లీ: ప్రముఖ ఐడీ దిగ్గజం 'యాహూ' తన బెంగుళూరు కార్యాలయంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందించడం కోసం కంపెనీని రీస్ట్రక్చరింగ్ చేస్తున్నామని యాహూ ఇండియా కార్పొరేట్ కమ్యూనికేషన్స్ మేనేజర్ ప్రాచి సింగ్ వెల్లడించారు.
ఐతే, సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నారన్న అంశంపై మాట్లాడుతూ, ఇప్పటికిప్పుడు దీనికి సంబంధించిన వివరాలను బయటకు వెల్లడించలేమని తెలిపారు. ప్రస్తుతం బెంగళూరు యాహూ క్యాంపస్ లోని సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ సెంటర్లో 2500 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు.

యాహూ పునర్వ్యవస్థీకరణలో భాగంగా దాదాపు 2 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన తప్పదనే ఊహాగానాలు వినిపించాయి. చివరకు కేవలం 250 మంది ఉద్యోగులు మాత్రమే కంపెనీలో మిగులుతారని ఓ రిపోర్ట్ చెబుతోంది.
ఉద్వాసన పలికే ఉద్యోగులకు సెవెరాన్స్ ప్యాకేజీ కింద ఆరు నెలల జీతం ముందుగానే చెల్లించనున్నారు. యాహు ఇండియా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ మంగళవారం నుంచి పూర్తిగా మూసివేయబడిందని ఊహాగానాలు వినిపించాయి.
ఇక యాహూ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒక ఇంటర్నెట్ సేవాధారిత సాఫ్టువేర్ సంస్థ. దీని సృష్టికర్తలు స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన డేవిడ్ ఫిలో మరియు జెర్రీ యాంగ్. ఇది ఒక సర్చ్ ఇంజిన్ను, ఈ-మెయిల్ సేవను, డైరెక్టరీ సేవలనూ మరియు ఇతర వెబ్ ఆధారిత సేవలను అందిస్తోంది. దీని ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియా లోని సన్నీవేల్ లో ఉంది.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్‌కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications