ఇంటి తలుపు తెరిచి సెక్స్ చేయాలనుకుంటున్నారా?
ముంబై: భారత్‌లో శుక్రవారం (నవంబర్ 20న) విడుదలైన జేమ్స్ బాండ్ తాజా చిత్రం 'స్పెక్టర్'కు కేంద్ర సెన్సార్ బోర్డు కోతలు పెట్టింది. ఘాటైన ముద్దు సన్నివేశాల నిడివిని సగానికి సగం తీసేసి, భారత్‌లో విడుదల చేసేందుకు అనుమతించింది. దీనిపై పెద్ద చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీబీఎఫ్సీ చైర్మన్ పహ్లాజ్ నిహ్లానీ స్పందించారు.
ఈ సినిమాలోని ముద్దు సన్నివేశాల పైన పలువురు చిత్ర పరిశ్రమ ప్రముఖులు సహా కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆయన ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కొందరు సభ్యులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోడీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో నిహ్లానీ స్పందించారు.
తలుపులు బార్లా తెరిచి శృంగారం చేయడాన్ని అంగీకరిస్తారా అని అభిప్రాయపడ్డారు. అసభ్యత, అశ్లీలత పట్ల కఠినంగా వ్యవహరిస్తారనే తనకు ఈ పదవి ఇచ్చారా.. అంటే కాదు అన్నారు. కఠినంగా వ్యవహరించి ఉండి ఉంటే చాలా సినిమాలు తిరస్కారానికి గురయ్యేవన్నారు.

స్పెక్ట్ర సినిమాలో ముద్దు సీన్లకు కోత పెట్టినందుకు సంస్కారీ బాండ్ అంటూ వేళాకోలం చేస్తున్నారని, కానీ గతంలో ఇచ్చిన రెండు బండా సినిమాల్లోను సన్నిహిత దృశ్యాలను అప్పటి బోర్డు అనుమతించలేదని గుర్తు చేశారు. ఇంటర్నెట్ యుగంలో సిబిఎఫ్సీ ఉదారంగా ఉండాలనే విషయానికి వస్తే.. అది తన చేతుల్లో లేదన్నారు.
ప్రభుత్వం చేతుల్లో ఉందన్నారు. నేను నిబంధనలు పాటించాలని, అవతలి వ్యక్తులు పాటించేలా చూడాలన్నారు. అశ్లీలం విషయంలో లక్ష్మణ రేఖ ఉండాలన్నారు. బాండ్ సినిమాలో ముద్దు సీన్ కోత పైన వ్యతిరేకత వ్యక్తం చేసే వారిక భారత్ అంటే ఏమిటో తెలియదన్నారు.
తాజా బాండ్ సినిమాలో ముద్దు సన్నివేశాలకు కోత పెట్టడం తప్పయిందే, గతంలోను అలాగే చేశారని వాటి మాటేమిటని నిలదీశారు. స్కైఫాల్ సినిమాలో ఒక్క ముద్దు సీన్ కూడా లేదని కానీ ఈ సినిమాలో ముద్దు సీన్‌ను మే 20 సెకన్ల మేర కట్ చేయమని కోరామన్నారు.
ఈ సందర్భంగా ఓ విలేకరి మాట్లాడుతూ... పది సెకన్లయినా, నిమిషమయినా ముద్దు ముద్దే అన్నారు. దానికి పహ్లాజ్ స్పందిస్తూ... అంటే మీరు ఇంటి తలుపులు బార్లా తీసి శృంగారంలో పాల్గొనాలనుకుంటున్నారా..., మీరు ఎలా శృంగారంలో పాల్గొంటున్నారో ప్రజలకు చూపాలనుకుంటున్నారా అని కౌంటర్ ఇచ్చారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి?












Click it and Unblock the Notifications