సంకీర్ణం ఊహ: జగన్‌కు ఇక చిక్కులే (పిక్చర్స్)

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన సత్తాను ఎక్కువగా ఊహించుకోవడం వల్ల, కేంద్రంలో సంకీర్ణమే వస్తుంది కాబట్టి తన మద్దతు తప్పనిసరి అవుతుందనే అంచనా వల్ల దెబ్బ తిన్నట్లు కనిపిస్తున్నారు. సీమాంధ్రలో తనకు తిరుగు ఉండదని ఆయన భావించారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని ఆయన నమ్మారు. అయితే, ఆయన ఓటమి చవి చూడడమే కాకుండా కేంద్రంలో ఆయన మద్దతు ఎవరికీ అవసరం లేకుండా పోయింది.

కానీ, చాప కింద నీరులా మాజీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి మాటలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్లి ఆయనను తీవ్రంగా దెబ్బ తీశాయి. ఈ స్థితిలో కేంద్రం నుంచి ఆయనకు ఏ విధమైన ఊరట లభించే అవకాశం లేదు. అటు కాంగ్రెసుకు దూరమై, ఇటు బిజెపికి దూరమై జాతీయ రాజకీయాల్లో ఆయన నామమాత్రంగా మిగిలే పరిస్థితి వచ్చింది.

అంతే కాకుండా, ఆయన తనపై ఉన్న కేసుల కారణంగా తీవ్రమైన చిక్కులను ఎదుర్కునే పరిస్థితి వచ్చింది. బిజెపితో దోస్తీ కట్టిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గానీ ఆయన పట్ల ఏ మాత్రం ఉదారంగా వ్యవహరించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో బిజెపి కూడా ఆయనను దూరంగానే పెట్టాలని నిర్ణయించుకుంది.

తేల్చేసిన మోడీ

తేల్చేసిన మోడీ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆఘమేఘాల మీద ఢిల్లీ వెళ్లి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. అయితే, ఆయనకు భేటీలో మోడీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

జగన్ ప్రస్తావించారట..

జగన్ ప్రస్తావించారట..

తనపై ఉన్న కేసుల గురించి జగన్ మోడీ వద్ద ప్రస్తావించారని సమాచారం. అయితే, చట్టం తన పని తాను చేసుకుని పోతుందని మోడీ వ్యాఖ్యానించారని తెలుస్తోంది.

మాకేం వద్దన్న బిజెపి

మాకేం వద్దన్న బిజెపి

అంశాలవారీగా తాను బిజెపి నేతృత్వంలోని ఎన్డియెకు మద్దతు ఇస్తానని జగన్ చెప్పారు. కానీ ఆ మద్దతు కూడా అవసరం లేదని బిజెపి తెగేసి చెప్పింది.

రాజ్‌నాథ్‌తో భేటీ

రాజ్‌నాథ్‌తో భేటీ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను కూడా కలుసుకున్నారు.

మోడీని వ్యతిరేకంగా మాట్లాడలేదు..

మోడీని వ్యతిరేకంగా మాట్లాడలేదు..

తాను ఎప్పుడు కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని వైయస్ జగన్ మీడియా వద్ద సర్ది చెప్పుకునే ప్రయత్నం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+