మోడీ మేజిక్: బాబుతో లాభం లేదని జగన్ పార్టీ!

హైదరాబాద్: నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సర్వత్రిక ఎన్నికల నాటికి లేదా ఆ తర్వాత కూటమి కోసం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రకటించక పోయినప్పటికీ బిజెపి వైపు అడుగులు వేస్తున్నట్లుగా కనిపించగా, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిలు కాంగ్రెసు పార్టీతో వెళ్లే అవకాశాలున్నాయని అందరూ భావించారు.

కానీ నాలుగు రాష్ట్రాలలో (మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ) కమలం సత్తా చాటడంతో రాష్ట్రానికి చెందిన నేతలు ఆ వైపు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బిజెపి వైపు మొగ్గే అవకాశాలు లేకపోలేదంటున్నారు. 2014 ఎన్నికలకు ముందు లేదా తర్వాత బిజెపితో వెళ్లే అంశంపై జగన్ పార్టీలో జోరుగా చర్చ సాగుతోందట. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెసు పార్టీ పని అయిపోయిందని ఈ ఎన్నికల ద్వారా తేలినందున బిజెపిపై చర్చ సాగుతోందంటున్నారు.

YSR Congress Party open to alliance with BJP

ఆ పార్టీకి చెందిన ఓ నేత మాట్లాడుతూ... రాష్ట్రంలో బిజెపి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకి వచ్చే లాభం ఏమీ ఉండదని, ఇప్పటికే టిడిపిని ప్రజలు ఆదరించడం లేదని వ్యాఖ్యానించారట. తద్వారా టిడిపి కంటే తమతో పొత్తు బిజెపికి లాభమనే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభావం ఉత్తర భారత దేశంలో బాగుందని, దక్షిణాదిన ఆయన వైపు యువత క్రమంగా మొగ్గుతుందని వైయస్సార్ కాంగ్రెసుతో పాటు టిడిపి, తెరాసలు కూడా భావిస్తున్నాయి.

తెరాస కూడా కాంగ్రెసు తెలంగాణపై మాట నిలబెట్టుకున్నా, నిలబెట్టుకోలేకపోయినా బిజెపి వైపు వెళ్లాలనే యోచనలో ఉందంటున్నారు. కాంగ్రెసు సార్వత్రిక ఎన్నికలలోపు తెలంగాణ ఇస్తే కొత్త రాష్ట్రంలో తమకు యాభై అసెంబ్లీ సీట్లకు పైగా వస్తాయని, ఇవ్వకుంటే క్లీన్ స్వీప్ ఖాయమని భావిస్తోంది. తెలంగాణ వస్తే ఎన్నికల నాటి పరిస్థితిని బట్టి కాంగ్రెసు లేదా బిజెపి వైపు మొగ్గడం, ఇవ్వకుంటే మాత్రం బిజెపి వైపుకు వెళ్లాలనే యోచనలో ఉన్నారని చెబుతున్నారు.

ఇక తెలుగుదేశం పార్టీ ఇటీవల బిజెపికి క్రమంగా దగ్గరవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆదివారం నాలుగు రాష్ట్రాల ఫలితాల అనంతరం టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. మోడీ వైపు యువత ఆకర్షితులవుతున్నారని, సుస్థిర, సుభిక్ష పాలనకు ప్రజలు పట్టం గట్టారని చెప్పారు. తద్వారా ఆయన బిజెపి దరికి చేరుతున్నారని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+