మీకో దండమంటూ వెళ్లిన జగన్, మార్షల్స్ ఎత్తుకెళ్లారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు సభాపతికి మీకో దండం అంటూ వెళ్లిపోయారు. తమ పార్టీకి చెందిన ఎనిమిది మంది శాసన సభ్యులను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ నిరసన తెలిపింది. స్పీకర్‌కు వ్యతిరేకంగా వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. జగన్ కూడా స్పీకర్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్పీకర్ ఆయనకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.
అయితే, స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ నుండి వాకౌట్ చేసింది. జగన్ తన స్థానం నుండి లేచి నిలబడి.. మీకో దండం అంటూ సభ నుండి బయటకు వచ్చారు. ఆయనను మిగతా సభ్యులు అనుసరించారు.

స్పీకర్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అధికార పార్టీ ఆదేశాలతో స్పీకర్ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని వైసీపీ సభ్యులు విమర్శలు గుప్పించారు. తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
సస్పెండైన సభ్యులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు ప్రయత్నించగా.. మార్షల్స్ రంగంలోకి దిగి వారిని అక్కడి నుండి బలవంతంగా పంపించారు. సభలోనే కాకుండా.. మీడియా పాయింట్ వద్ద కూడా తమ గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు.
అంతకుముందు ఏపీ అసెంబ్లీ నుంచి సస్పెండైన వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ మార్షల్స్‌తో వాగ్వాదానికి దిగారు. అసెంబ్లీ నుంచి సస్పెండైన 8 మంది సభ్యులు అసెంబ్లీ హాలు గేటు వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. ఆందోళనను విరమించాలని మార్షల్స్ కోరారు. దీనిపై తాము తెలంగాణ అసెంబ్లీ ప్రాంతంలో ఉన్నామని చెపుతూ వైసీపీ ఎమ్మెల్యేలు మార్షల్స్‌కు వాదనకు దిగారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications