వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల రోజు అమెరికాపై ఆల్ ఖైదా దాడి !

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధికారులు ఎన్నికల నిర్వహణలో తలమునకలై బిజీబిజీగా ఉన్న సమయంలో అల్ -ఖైదా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని కొలంబియా బ్రాడ్ కాస్టింగ్ సిస్టం(సీబీఎస్) శుక్రవారం ఒక కథనం ప్రచురించింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో అమెరికాపై ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందటూ ఆ మీడియా సంస్థ పెద్ద బాంబు పేల్చింది. కొలంబియా బ్రాడ్ కాస్టింగ్ సిస్టం ఈ కథనం ప్రచురించడంతో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది.

సీబీఎస్ కథనం మేరకు పోలింగ్ జరగడానికి ఒక రోజు ముందే (నవంబర్ 7వ తేది సోమవారం) అల్ ఖైదా దాడులకు దిగుతుందని తమకు సమాచారం ఉందని తెలిపింది. యూఎస్ లో కీలకమైన న్యూయార్క్, టెక్సాస్, వర్జీనియా రాష్ట్రాలను ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నారని తెలిపింది.

ఈ మూడూ రాష్ట్రాలతో పాటు ప్రసిద్ధి చెందిన మిగిలిన ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని సీబీఎస్ తన కథనంలో తెలిపింది. ఈమేరకు అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలు ఇప్పటికే స్థానిక అధికారులకు హెచ్చరికలు జారీ చేశారంటూ సీబీఎస్ పేర్కొంది.

అయితే ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(ఎఫ్బీఐ) మాత్రం ఈ వార్తలను అధికారికంగా ధృవీకరించలేదు. అలాగని సీబీఎస్ వార్తలను ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తిరస్కరించినట్లుకాని, ఖండించన్నట్లు కాని వెల్లడించలేదు.

అమెరికా ఉగ్రవాద నిరోదక విభాగం, దేశీ భద్రతా బలగాలు, ఇంటెలిజెన్స్ వర్గాలు పూర్తి సమన్వయంతో వ్యవహరిస్తున్నాయని, అనుకోని ఉపద్రవం ఎదురైతే ధీటుగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఎఫ్ బీఐ సమాధానం ఇచ్చినట్లు సీబీఎస్ తన కథనంలో తెలిపింది.

Terror attack suspected around US election day: Say CBS Report

మరోవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్, ఎన్నికల సరళికి సంబంధించిన వెబ్ సైట్ల హ్యాకింగ్ తదితర మార్గాల్లో ఉగ్ర దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని సీబీఎస్ అభిప్రాయపడుతూ కథనం ప్రచురించింది. సీబీఎస్ కథనంతో అమెరికా ప్రజలు హడలిపోతున్నారు.

అయితే మీకు ఎలాంటి భయం అవసరం లేదని, తాము అన్ని విధాల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని ఎఫ్ బీఐ అధికారులు అంటున్నారు. ఎఫ్ బీఐ ఎంత హామీ ఇచ్చిన ప్రజల్లో మాత్రం ఆందోళనలు ఎక్కువ అవుతున్నాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధికారులు ఎన్నికల నిర్వహణలో తలమునకలై బిజీబిజీగా ఉన్న సమయంలో అల్ -ఖైదా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని, పోలింగ్ జరగడానికి ఒక రోజు ముందే (నవంబర్ 7వ తేది సోమవారం) అల్ ఖైదా దాడులకు దిగుతుందని కొలంబియా బ్రాడ్ కాస్టింగ్ సిస్టం(సీబీఎస్) ఓ కథనం ప్రచురించడంతో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది.

English summary
We are aware of the information. We have been working with the FBI through the Joint Terrorism Task Force and our Counterterrorism and Intelligence Bureaus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X